స్వచ్ఛ అమరావతి.. ! ఇన్‌సైడర్‌ ఆరోపణల్ని కొట్టేసిన సుప్రీం..!

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ తేలిపోయాయి. నేరుగా సుప్రీంకోర్టే వాటిని కొట్టేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేదే లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని గత విచారణ సందర్బంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈ రోజు జరిగిన విచారణలో.. ప్రభుత్వపిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి .. అధికారంలోకి రాక ముందు నుంచీ చేస్తున్న ఆరోపణలు తేలిపోయినట్లయ్యాయి. రాజధాని ఎక్కడ పెడతారో ముందే సన్నిహితులకు తెలిపి.. వారితో భూములు కొనిపించారని.. ఆ తర్వాత రాజధాని ప్రకటించడం వల్ల పెద్ద ఎత్తున లాభం పొందారని.. ఇది లక్షల కోట్ల కుంభకోణం అని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని వైసీపీ నేతలు… జగన్మోహన్ రెడ్డి సహా ఆరోపిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన తరవాత దీనిపైనే విచారణ కూడా ప్రారంభించారు. అప్పట్లో భూములు కొన్న కొంత మందిని అదుపులోకి తీసుకోవడం.. ప్రశ్నించడం.. అమ్మిన వారి ఇళ్లకు వెళ్లి సీఐడీ అధికారులు హడావుడి చేయడం వంటివి చేశారు. తర్వాత ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అసలు ఫిర్యాదు దారులు లేకుండా… ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసి.. అసలు విచారణను కొట్టి వేసింది. దీనిపై ప్రభుత్వం హడావుడిగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులోనూ కేసు తేలిపోయింది. దీంతో అమరావతిపై జగన్మోహన్ రెడ్డి వేసిన అతి పెద్ద నింద.. నిజం కాదని తేలిపోయింది.

అయితే.. ఈ కేసు తేలిపోతుందని ముందే అనుకున్నారేమో కానీ.. దళితుల దగ్గర్నుంచి భూములు లాక్కున్నారంటూ.. అసైన్డ్ భూములపై కుట్ర చేశారంటూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసును సీఐడీ పోలీసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఇక్కడ కూడా దళిత రైతులెవరూ.. తమను ఎవరూ బెదిరించలేదని ఇష్టపూర్వకంగానే అమ్ముకున్నామని చెబుతున్నారు. కానీ ఏపీ సర్కార్‌తో పాటు.. కొన్ని అనుకూల మీడియాల్లో మాత్రం విస్తృతంగా కుంభకోణం అంటూ ప్రచారం చేసి.. ఇప్పటికీ హడావుడి చేస్తూనే ఉన్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో .. అమరావతిపై పడిన అతి పెద్ద నింద తొలగిపోయినట్లయింది. ఈ కారణంతోనే రాజధానిని తరలించాలనుకున్న ప్రభుత్వానికి ఇది షాక్ లాంటిదేనని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close