ఏపీ సెక్రటేరియట్‌లో సీన్ మారిపోయిందా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత… కేంద్ర పాలన తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. కోడ్ పేరుతో.. ఎవర్నీ పని చేయనివ్వకుండా చేశారు. దాంతో అధికార యంత్రాంగం గాడి తప్పింది. ఏ పనీ చేయడం లేదు. చాలా మంది… రాబోయే ప్రభుత్వం పేరుతో అంచనాలు వేసుకుని ప్రాధాన్య పోస్టుల కోసం లాబీయింగ్ ప్రారంభించారు. కానీ కేబినెట్ భేటీ తర్వాత పరిస్థితి మారిపోయింది.

పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్ర పాలన పరిస్థితులు..!

ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత చంద్రబాబు సాధారణ పరిపాలన ప్రారంభించారు. పోలవరం, రాజధానిపై సమీక్షలు చేయగానే… ప్రతిపక్ష పార్టీ నుంచి ఫిర్యాదుల పరంపర ప్రారంభమయింది. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని.. ఆయన పాలన చేస్తారనే వాదనను.. వైసీపీ తెరపైకి తీసుకు వచ్చింది. ఈసీకి ఫిర్యాదులు చేసింది. ఆపద్దర్మ ప్రభుత్వం అంటే.. ఏంటో ఈసీకి తెలియకుండా ఉండదు. కానీ సీఈవో కూడా.. వెంటనే… అధికారులకు ఓ రకమైన హెచ్చరికలు చేస్తున్నట్లుగా మాట్లాడారు. అందరికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. స్వయంగా చీఫ్ సెక్రటరీనే.. ముఖ్యమంత్రికి అధికారాల్లేవంటూ.. మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి మరీ చెప్పారు. అదే సమయంలో తానే సర్వాధికారినంటూ.. ఆయన సమీక్షలు ప్రారంభించారు. కేబినెట్ నిర్ణయాలపై విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో అధికారవర్గాల్లో ఓ రకమైన ఆందోళన ఏర్పడింది. ఫలితంగా ఎందుకొచ్చిన తిప్పలంటూ.. కొంత మంది కీలకమైన అధికారులు సెలవుపై వెళ్లారు. మరికొందరు ఎన్నికల విధులు మాత్రమే నిర్వహిస్తున్నారు.

కేబినెట్ భేటీతో అందర్నీ కట్టి పడేసిన సీఎం..!

కేంద్రంలో పాలన గాడి తప్పే పరిస్థితుల్ని తీసుకురావడంలో.. ఢిల్లీ స్థాయి ప్రణాళికలు ఉన్నాయని భావించిన చంద్రబాబు… వెంటనే పాలనా యంత్రాగాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా ప్రభుత్వం మారుతుందన్న ప్రచారాన్ని కట్టడి చేశారు. మళ్లీ టీడీపీనే అధికారంలోకి రాబోతోందన్న విషయాన్ని స్పష్టంగానే ఉద్యోగుల్లోకి తీసుకెళ్లారు. అంతే కాదు… ఓ వైపు.. ఉద్యోగులకు విజ్ఞప్తులు చేస్తూనే.. మరో వైపు… కట్టు దాటే వారిని ఉపేక్షించేది లేదని.. నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతే కాదు.. మంత్రివర్గ సమావేశాన్ని కూడా.. ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి కోడ్ ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశం అనేది.. ఊహించలేని విషయం. కేబినెట్ మీటింగే పెట్టగలిగినప్పుడు.. ఇతర పాలనాధికారాలు ఎందుకుండవన్న చర్చ అధికారుల్లో ప్రారంభమయింది. అదే సమయంలో..సీఎంతో సమీక్షలకు వెళ్లవద్దని తాను చెప్పేలేదంటూ.. సోమిరెడ్డి విషయంలో సీఈవో క్లారిటీ ఇవ్వడంతో… పరిస్థితి మారిపోయింది.

సీఎస్ కూడా… సర్దేసుకున్నారు..!

మంత్రివర్గ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. సీఎస్ తీరు కూడా మారిపోయింది. అదే సమయంలో.. సీఎస్… తనను ముఖ్యమంత్రి నియమించలేదన్న విషయం కూడా మర్చిపోయి… బిజినెస్ రూల్స్ ఉల్లంఘించే పనులు చేశారన్న ప్రచారం ఉంది. కేబినెట్ నిర్ణయాలను సమీక్షించే ప్రయత్నం చేయడం, టీటీడీ బంగారంపై ఏకపక్షంగా విచారణకు ఆదేశించడం, కిడ్నీ రాకెట్‌లో ఇరుక్కుపోయిన సింహపురి ఆస్పత్రిని కాపాడేందుకు అధికార దుర్వినియోగం చేయడం వంటి అంశాల్లో సీఎస్ ఒత్తిడికి గురయ్యారు. దాంతో.. ఆయన… సీఎం తనను పిలిస్తే వెళ్తానంటూ… చెప్పుకొచ్చిన ఆయన.. ఓ ఉదయం నేరుగా ఉండవల్లి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. కేబినెట్ భేటీపై చర్చించి వచ్చారు. కేబినెట్ సమావేశంలోనూ అంతే చొరవగా వ్యవహరించారు. దీంతో సీఎస్ సర్దుకున్నాక తమకు ఎందుకు గొడవలని.. ఇతర అధికారులూ.. మళ్లీ టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close