విజ‌య‌సాయి వితండానికి హ‌ద్దు లేకుండా పోతోందే..!

వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఆరోప‌ణ‌ల‌కు హ‌ద్దూ అదుపూ లేకుండా పోతోంది. చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ప‌స ఉందా లేద‌నే ఆలోచ‌న ఉంటున్న‌ట్టుగా లేదు! క‌నీసం ఏదో ఒక ఆధారం చూపి ఆరోపించినా వాటికి బ‌లం ఉన్నట్టు క‌నిపిస్తుంది క‌దా. ప్ర‌స్తుతం టీటీడీ అంశం చ‌ర్చ‌నీయంగా ఉంది కాబ‌ట్టి, దీన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. టీటీడీ నేలమాళిగ‌లో ఉన్న వేంక‌టేశ్వ‌రుని ఆభ‌ర‌ణాల‌ను సీఎం త‌న ఇంటికి త‌ర‌లించార‌ని ఆరోపించారు! ఆంధ్రప్ర‌దేశ్ లో సంప‌ద త‌రిగిపోతోంద‌ని గుర్తించార‌నీ, అందుకే చివ‌రికి ఆల‌యాల సంప‌ద‌ను కూడా దోచుకుంటున్నార‌ని తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.

టీటీడీకి సంబంధించిన ఆభ‌ర‌ణాల‌ను సింగ‌పూర్ పంపించేశార‌న్నారు. అంతేకాదు, అమ‌రావ‌తి, హైద‌రాబాద్ లలోని సీఎం ఇళ్ల‌లో సంప‌ద‌లు నిల్వ పెట్టార‌న్నారు. తెలంగాణ పోలీసుల‌నుగానీ, సీబీఐతోగానీ 12 గంట‌ల్లో సోదాలు చేయిస్తే… చంద్ర‌బాబు ఇంట్లో ఉన్న నిధులూ దేవుని ఆభ‌ర‌ణాలూ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్నారు. ఒక‌వేళ అలా బ‌య‌టప‌డ‌ని ప‌క్షంలో మ‌రుక్ష‌ణ‌మే త‌న రాజ్య‌స‌భ స‌భ్యత్వానికి రాజీనామా చేస్తాన‌ని విజ‌యసాయి స‌వాల్ చేశారు. హిందూ ధ‌ర్మంపై న‌మ్మ‌కం ఉంటే దోచుకున్న శ్రీ‌వారి న‌గ‌ల‌ను వెంట‌నే చంద్ర‌బాబు తిరిగి అప్ప‌గించాల‌న్నారు.

ఈ ఆరోప‌ణ‌లు అర్థ‌వంతంగా ఉన్నాయా..? న‌గ‌లు సింగ‌పూర్ వెళ్లాయ‌న్న క‌న్ఫ‌ర్మేష‌న్ విజ‌యసాయికి ఉంటే… ఆ ఆధారాలు బ‌య‌ట‌పెట్టి ఆరోపిస్తే బాగుండేది. చంద్ర‌బాబు అవినీతిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఫిర్యాదు చేశాన‌నీ, బోనులో నిల‌బెట్టే వ‌ర‌కూ నిద్ర‌పోన‌ని ఆ మ‌ధ్య ప్ర‌తిజ్ఞ చేశారు. ఇప్పుడు కూడా పీఎంవోకి వెళ్లి, శ్రీ‌వారి న‌గ‌లు చంద్ర‌బాబు ఇంట్లో ఉన్నాయ‌ని ఫిర్యాదు చేసి… కేంద్ర ఆదేశాల‌తోనే సీబీఐ ఎంక్వ‌యిరీ వేసే ప్ర‌య‌త్నం చెయ్యొచ్చు క‌దా! ఎలాగూ కేంద్రం కూడా ఏపీ సీఎం మీద ఏదో ఒక కోణం నుంచి ద‌ర్యాప్తు ఆదేశాలు ఇవ్వాల‌నే కుట్ర‌తో ఉన్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా!

ప్ర‌తీ అంశాన్ని వివాదాస్ప‌దం చేయ‌డ‌మే త‌ప్ప‌… ఆ క్ర‌మంలో చేస్తున్న ఆరోప‌ణ‌లూ విమ‌ర్శ‌లు ప్ర‌జ‌లు హ‌ర్షించేవిగా ఉన్నాయా లేవా అనే విచక్షణ వారికి ఉండటం లేదు. ఇంకోటీ.. త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా అంటూ ఇప్పుడు విజ‌య‌సాయి స‌వాల్ చేశారు! అది మ‌రీ హాస్యాస్ప‌దంగా ఉంది. ప్ర‌త్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పదవులను త్యాగాలు చేశారంటూ జ‌గ‌న్ ప్ర‌క‌టించినా… అది విజ‌య‌సాయి రెడ్డికి వ‌ర్తించ‌ని త్యాగంగా మిగిలిపోయింది. ఆయన చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే అర్థమౌతోంది. ఇప్పుడు కూడా.. ఈ స‌వాల్ ను ఎవ్వ‌రూ తీవ్రంగా తీసుకునే ప‌రిస్థితి ఉండ‌దు. ఆ విష‌యం విజ‌యసాయికి తెలుసు కాబ‌ట్టి.. రాజీనామా చేసేస్తా అంటూ స‌వాల్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close