బిగ్ బాస్ కోసం హాట్ యాంక‌ర్ల వేట‌

బిగ్ బాస్ 3 సీజ‌న్ మొద‌లైపోతోంది. జూన్ – జులైలో కొత్త సెష‌న్‌కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఈ షోని న‌డిపించే స్టార్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. అయితే… షో లో పాల్గొనే సెల‌బ్రెటీల వేట మాత్రం మొద‌లైపోయింది. దాదాపు 20 మంది సెల‌బ్రెటీల‌తో ఓ లిస్టు త‌యారైపోయింది. అందులో ఎవ‌రిని ఫైన‌ల్ చేయాల‌న్న విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి. లిస్టులో హాట్ యాంక‌ర్ల పేర్లు చాలానే ఉన్నాయ‌ని టాక్‌. ర‌ష్మి, ఉద‌య‌భాను, ఝాన్సీ, లాస్య‌ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ప్ర‌దీప్‌, ర‌వి ఇద్ద‌రిలో ఒక‌రు ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎప్ప‌టిలానే జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్‌పైనా బిగ్ బాస్ దృష్టి పెట్టింది. అందులోంచి ఒక‌రిని ఎంపిక చేయొచ్చు. టిక్ టాక్‌లాంటి యాప్‌ల‌తో సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోయిన వాళ్లు పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. మాజీ హీరోయిన్లు, హీరోల్ని కూడా బాగానే ప‌రిశీలిస్తున్నారు. వాళ్ల‌కు రోజువారీ పారితోషిక‌మే కాకుండా, సేప‌రేట్ ప్యాకేజీ ఇచ్చి షోలోకి తీసుకొద్దామ‌ని బిగ్ బాస్ టీమ్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రెండో సీజ‌న్‌లో సెల‌బ్రెటీలెవ‌రూ లేర‌ని, ఉన్న‌వాళ్ల‌తోనే స‌రిపెట్టేసుకున్నారు. ఈసారి మాత్రం ఆలోటు క‌నిపించ‌కూడ‌ద‌న్న‌ది బిగ్ బాస్ ఉద్దేశం. మ‌రి వీళ్ల‌లో ఫైన‌ల్ లిస్టులో మెరిసేదెవ‌రో తేలాలంటే… బిగ్ బాస్ 3 మొద‌ల‌వ్వాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com