రఘువీరా అండ్‌ కో ‘లెగ్‌’కు సెంటిమెంట్‌ జతకలిసిందా?

రాజకీయాల్లోను, సినిమాల్లోను ఉన్నంత సెంటిమెంటు పిచ్చి మరే ఇతర రంగంలోనూ ఇసుమంత కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. బహుశా అలాంటి సెంటిమెంటు ఫీలింగుతోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో డిమాండు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి సారథ్యంలో పార్టీ నాయకులు కేవీపీ రామచంద్రరావు, సి.రామచంద్రయ్య తదితరులు ప్రస్తుతం అసోంలో ఉన్నారు. అక్కడి ఎన్నికల ప్రచారంలో మోడీని ఓడించడానికి వీరు కంకణం కట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఒకరోజు ప్రచారం పూర్తయింది. మరికొన్ని రోజులు ప్రచారం కూడా ఉంటుంది.

అయినా.. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్న సామెత చందంగా సొంత రాష్ట్రంలో నికరంగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకుండా కుదేలైపోయిన పార్టీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో ప్రజలను ప్రభావితం చేసి పార్టీకి ఒనగూర్చే మేలేమి ఉంటుందా? అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక్కడంతా సెంటిమెంట్లే ఎక్కువ పనిచేసేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ గెలవడం సంగతి తర్వాత.. ముందు మోడీ ప్రాభవాన్ని దెబ్బకొట్టి ఓడించగలిగితే చాలు అన్నట్లుగానే వీరి ప్రస్తుత ప్రచారం కూడా సాగుతోంది.

గతంలో బీహార్‌ ఎన్నికల సమయంలో కూడా ఏపీసీసీ నాయకులు అక్కడకు వెళ్లి ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. సికిందాబాదునుంచి బీహార్‌కు వెళ్లే రైళ్లలో కూడా కరపత్రాలు పంచుతూ.. ఏపీసీసీ నాయకులు మోడీకి ఓటు వేయవద్దంటూ విజ్ఞప్తులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మోడీ ఎలా మోసం చేశారో వివరిస్తూ.. అలాంటి మోసపూరిత నాయకుడి పార్టీని గెలిపించవద్దంటూ వారి ప్రచారం సాగింది. ఏది ఏమైనప్పటికీ.. బీహార్‌లో నితీశ్‌ అనుకూల పవనాలే అప్పట్లో విజయం సాధించాయి. తమ పార్టీ ఎప్పటిలాగా అక్కడ కూడా నాశనం అయినప్పటికీ.. కనీసం మోడీ ఓడిపోయాడు గనుక.. తమ ప్రచారానికి ధన్యత దక్కిందని పండగచేసుకున్న రఘువీరా అండ్‌ కో ఇప్పుడు అసోం ఎన్నికల మీద కన్నేసినట్లుగా కనిపిస్తోంది. అక్కడకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ కు కాసింత బలం ఉందనుకుంటున్న అసోం వరకే పరిమితం అవుతారో.. లేదా, మోడీ వ్యతిరేకతను దేశవ్యాప్తంగా టముకు వేయడమే లక్ష్యంగా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాలికి బలపం కట్టుకుని ప్రచారపర్వంలో పాల్గొంటారో వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close