సంచ‌ల‌నంగా మారుతున్న సీజేఐపై వేధింపుల ఆరోప‌ణ కేసు!

దేశ‌చ‌రిత్ర‌లో తొలిసారిగా న‌లుగురు జ‌డ్జీలు మీడియా ముందుకు వ‌చ్చి, పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌లూ చేస్తూ సంచ‌ల‌నం సృష్టించిన కేసు ఏ స్థాయిలో ఉందో… ఇప్పుడు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిపై వేధింపుల ఆరోప‌ణ‌ల వ్య‌వ‌హారం కూడా అంతే చ‌ర్చ‌నీయంగా మారుతోంది. జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విచార‌ణ జ‌రిపేందుకు సుప్రీం కోర్టు సిద్ధ‌మైంది. దీని కోసం రిటైర్డ్ న్యాయ‌మూర్తి ఏకే పట్నాయ‌క్ ను నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారంలో సీబీఐతోపాటు, ఐబీ డైరెక్ట‌ర్లు, ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ల‌ను ప‌ట్నాయ‌క్ కు స‌హ‌క‌రించాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈకేసుపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం… స్వ‌తంత్ర విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించింది.

దేశంలో అత్యున్న‌త‌మైన ఛీఫ్ జ‌స్టిస్ ప‌ద‌విని కూడా అప్ర‌తిష్ట‌పాలు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఓప‌క్క విప‌క్షాలు విమర్శ‌లు చేస్తున్నాయి. ఉద్యోగం నుంచి తొల‌గించార‌న్న కార‌ణంతో ఒకామె ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేయ‌డానికి కార‌ణ‌మైంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఒక‌వేళ గొగోయ్ లైంగిక వేధింపుల‌కు గురిచేస్తే… ఆధారాల‌తో నేరుగా మీడియా ముందుకు రావొచ్చు, లేదంటే న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించొచ్చు. అంతేగానీ, ఆమె ఏకంగా అంద‌రి న్యాయ‌మూర్తుల‌కీ ఇత‌ర విభాగాల‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమె వెన‌క ఎవ‌రో ఉన్నార‌నీ, లేదంటే ఇంత పెద్ద ఎత్తున పక‌డ్బందీ వ్యూహంతో ఇలా వ్య‌వ‌హ‌రించేవారు కార‌నే అభిప్రాయాలూ కొన్ని వ్య‌క్త‌మౌతున్నాయి.

అయితే, గొగోయ్ పై ఈ ఆరోప‌ణ‌ల వెన‌క ఓ పెద్ద కుట్ర కోణం ఉందంటూ ఓ న్యాయ‌వాది కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ కుట్ర‌లో భాగ‌మే ఈ ఆరోప‌ణ‌ల‌ని అంటున్నారు. కేష్ ఫ‌ర్ జ‌డ్జిమెంట్ వ్య‌వ‌హారాన్ని గొగోయ్ అడ్డుకున్నానీ, కాబ‌ట్టి ఆయ‌న్ని ఎలాగోలా త‌ప్పించాల‌నేది ఈ కుట్ర వెన‌క ఉన్న కొంత‌మంది ఉద్దేశ‌మ‌ని ఆ న్యాయ‌వాది అభిప్రాయ‌ప‌డ్డారు. ఎప్పుడో డిసెంబ‌ర్ లో ఉద్యోగం నుంచి తొలగించిన మ‌హిళ‌… ఇన్నాళ్లూ మౌనంగా ఉండి, ఇప్పుడు ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటే దీని వెన‌క వేరే కోణం క‌చ్చితంగా ఉంద‌నేది ఆయ‌న అభిప్రాయం. కోర్టు తాజా ఆదేశాల‌తో ఈ కుట్ర కోణంపై విచార‌ణ మొద‌లైంద‌నే చెప్పాలి. మొత్తానికి, ఈ కేసు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close