హైదరాబాద్ నుంచి కేవలం 25 నిమిషాల దూరంలో ఉన్న షాద్‌నగర్, ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు అది తెలంగాణ రియల్ ఎస్టేట్ ‘గోల్డెన్ గేట్‌వే’గా మారిపోతోంది. రీజనల్ రింగ్ రోడ్ , ఫార్మా సిటీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ వేర్‌హౌస్ వంటి భారీ ప్రాజెక్టులు షాద్‌నగర్‌ను రాకెట్లా ఎగసిపడేలా చేస్తున్నాయి.
నిపుణుల అంచనా ప్రకారం, 2025లో భూమి ధరలు 15-20% పెరుగుతాయి. గత ఏడాది 16.1% పెరుగుదల సాధించింది. ఈ బూమ్‌కు ముఖ్య కారణం ఇన్ఫ్రా డెవలప్మెంట్. RRR షాద్‌నగర్ దగ్గర పాస్ అవుతూ, లాజిస్టిక్స్ మరియు రెసిడెన్షియల్ హబ్‌గా మార్చుతోంది. ఫార్మా సిటీలో డా.రెడ్డీస్, నాట్కో, MSN ల్యాబ్స్ వంటి కంపెనీలు 50,000కు పైగా ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ IT ప్రొఫెషనల్స్ ఇన్‌ఫ్లోను పెంచుతోంది.
ధరలు ఇప్పుడు చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు స్క్వేర్ యార్డ్‌కు లభిస్తున్నాయి. వచ్చే ఏడాది కల్లా రూ.4,000-రూ.7,000కు చేరతాయని అంచనా. విల్లాలు రూ.80 లక్షలు నుంచి రూ.1.5 కోట్లు, 2BHK ఫ్లాట్లు రూ.35-రూ.50 లక్షలు ఉన్నాయి. హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న కొద్దీ ధరలు వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
