శైలజారెడ్డి ఒకరోజు ముందే విడుదల

శైలజరెడ్డి అల్లుడు వినాయకచవితి రోజు ఈ నెల 13న విడుదలవుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తెలియని సంగతి ఇంకోటి వుంది. ఆ సినిమాను ఓ రోజు ముందే విడుదల చేస్తున్నారు. ముహుర్తం కోసం 12న సాయంత్రమే ఓ టికెట్ షో ఏర్పాటు చేసుకుంటున్నారు నిర్మాత వంశీ సూర్యదేవర.

అయితే ఇది కేవలం నిర్మాత కుటుంబ సభ్యులకు, చుట్టాలకు మాత్రమే. ఈ షో ఫ్రీగా గా కాదు. టికెట్ లు అమ్ముతారు. కానీ ఆ కుటుంబ సభ్యులకు, చుట్టాలకు మాత్రమే. అన్నీ కలిపి మహా అయితే ఓ 70 టికెట్ లు అన్నమాట.

ఆ విధంగా శైలజారెడ్డి సినిమాను సరైన ముహుర్తానికే విడుదల చేసినట్లు అవుతుంది. ఆ తరువాత యుఎస్ షోలు, ఇండియాలో షో లు మామూలే. శైలజారెడ్డి అల్లుడు సినిమా సెన్సారు పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ తెచ్చుకుంది. సెన్సార్ రిపోర్టు్ పాజిటివ్ గానే వుంది. దీంతో యూనిట్ హ్యాపీగా ఈ ప్రత్యేక టికెట్ షో ఏర్పాట్లు చేసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com