శంక‌ర్ సినిమాకి ఇదే టైటిలా?

రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. చిత్రీక‌ర‌ణ దాదాపు 50 శాతం పూర్త‌య్యింది కూడా. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ టైటిల్ బ‌య‌ట‌కు రాలేదు. స‌ర్కారోడు, సిటిజ‌న్ అంటూ ర‌క‌ర‌కాల పేర్లు అనుకొన్నారు. ఇప్పుడు మ‌రో కొత్త టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకి ‘సీఈవో’ అనే పేరు పెట్టార‌ని చెప్పుకొంటున్నారు. సీఈవో అంటే… చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ అనే అర్థం ఉంది. ఈ సినిమాలో… చ‌ర‌ణ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే… అక్క‌డితో ఆగిపోవ‌డం లేదు. ఆ త‌ర‌వాత సీఎమ్ కూడా అవుతాడు. కొన్ని చోట్ల ముఖ్య‌మంత్రుల్ని ‘చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్’ అని కూడా పిలుస్తారు. అలా… రెండు అర్థాలు వ‌చ్చేలా ఈ పేరు పెట్టారేమో అనిపిస్తోంది. అయితే.. ఇదేం ఖాయం కాదు. శంక‌ర్ ద‌గ్గ‌ర ఇలాంటి టైటిళ్లు చాలా ఉన్నాయి. అవ‌న్నీ కేవ‌లం ప‌రిశీల‌న‌లో మాత్ర‌మే ఉన్న టైటిళ్లు. అందులో ఏది ఖాయం చేస్తారో ఎవ‌రికీ తెలీదు. ఈనెల‌లోనే చ‌ర‌ణ్ పుట్టిన రోజు వ‌స్తోంది. ఆ రోజున‌.. చ‌ర‌ణ్ టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close