షర్మిల సలహాదారులుగా వైఎస్ నమ్మిన బంట్లు..!

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై షర్మిల చాలా వేగంగా కసరత్తు పూర్తి చేస్తున్నారు. పార్టీ ప్రకటన తర్వాత రాజకీయ పోరాటం తప్ప… పార్టీ పరమైన పనులేమీ పెండింగ్ ఉండకుండా… జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా… తన పార్టీకి.. ఇద్దరు సలహాదారుల్ని నియమించారు. రిటైరైన సివిల్ సర్వీస్ అధికారులు.. అదీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీఎంవోలో అత్యంత కీలకంగా వ్యవహరించిన అధికారులకు మొదటి సారిగా రెండు సలహాదారుల పదవులు ఇచ్చారు. అందులో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి కాగా.. మరొకరు ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ సిన్హా. సిన్హా.. అప్పటి సీఎం వైఎస్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు.

షర్మిల రాజకీయ పార్టీ కోసం వేస్తున్న అడుగులను బట్టి చూస్తే.. పూర్తిగా అన్న జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో తన తండ్రికి నమ్మకంగా పని చేసిన వారినే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇలా.. షర్మిల పార్టీలో కీలక వ్యక్తులు చేరడానికి తెర వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ హయాంలో ాయన కూడా చక్రం తిప్పారు. షర్మిల ఇంటి వద్దకూ ప్రతీ రోజూ.. కొన్ని ఎంపిక చేసిన వర్గాల నేతలు వచ్చేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. షర్మిల ప్రతి రోజూ.. పార్టీ ఆఫీసుకు వచ్చే సరికి కనీసం యాభై, అరవై మందికి తగ్గకుండా… వివిధ జిల్లాల నుంచి విభిన్నవర్గాలకు చెందిన ఓ మాదిరి చోటా నేతలు లోటస్ పాండ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. వారికి భరోసా ఇస్తూ.. షర్మిల పార్టీ ఆఫీసులోకి వెళ్తున్నారు.

పార్టీకి చాలా క్రేజ్ ఉందని చెప్పేందుకు రాజకీయాలతో సంబంధం లేని విభిన్న రంగాల్లో ప్రముఖులయిన వారిని షర్మిలతో భేటీకి ఆహ్వానిస్తున్నారు. నల్లగొండకు చెందిన మోటివేషనల్ స్పీకర్ షఫీ కూడా షర్మిలను కలిశారు. ఆయన కూడా రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ఇలా… ప్రముఖులుగా మారి.. రాజకీయ ఆకాంక్షలు ఉన్న వారిని షర్మిల పార్టీ ప్రతినిధులు సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close