శర్వానంద్ విలక్షణ నటుడే. తన కెరీర్ లో అన్ని రకాలు పాత్రలు చేశాడు. ఐతే తనకి కమర్షియల్ మాస్ హీరోగా పేరుతెచ్చిన సినిమాలు తక్కువ. ఫైట్లు డ్యాన్సులకి ప్రాధాన్యత వున్న సినిమాలు శర్వా నుంచి ఎక్కువ రాలేదు. ఇప్పుడు ‘బైకర్’ చేస్తున్నాడు. ఇందులో తనది మోటార్‌సైకిల్ రేసర్ క్యారెక్టర్. ఇటివలే ఫస్ట్ ల్యాప్ రిలీజ్ చేశారు.
మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఇది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. తాజాగా ప్రెట్టీ బేబీ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇది మెలోడీ టచ్ వున్న డ్యాన్స్ నెంబర్. జిబ్రాన్ స్కోర్, కృష్ణకాంత్ లిరిక్స్ ఫ్రెష్ గా వున్నాయి.
ఈ సాంగ్ లో శర్వా చేసిన డ్యాన్సులు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్యాన్స్ కోసం స్పెషల్ కేర్ తీసుకొని చేసిన పాటలా అనిపించింది. ఈ మధ్య కాలంలో శర్వా నుంచి వచ్చిన పాటల్లో ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది. తనలో ఇంత మంచి డాన్సర్ ఉన్నాడా అనిపించేలా కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా శర్వా కెరియర్ లో చాలా కీలకం. కాబట్టి అన్ని రకాలుగా కష్టపడ్డాడు అనిపిస్తోంది. డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
