టీజ‌ర్ తో అటెన్ష‌న్ తీసుకొచ్చిన‌ శ‌ర్వానంద్‌, మారుతి “మ‌హ‌నుభావుడు”


శ‌ర్వానంద్ హీరోగా, మెహ‌రిన్ హీరోయిన్ గా, ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు. ఓక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. హీరో శ‌ర్వానంద్ చాలా ఢిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్ లో క‌నిపిస్తున్నారు. నా పేరు ఆనంద్ నాకో ఓసిడి వుంది.. ఓ సిడి అంటే బిటెక్, ఎమ్ టెక్ టాంటి డిగ్రీలు కాదు డిజార్డ‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు అతి శుబ్రం, విప‌రీత‌మైన నీట్ నెస్‌.. అంటూ వాయిస్ ఓవ‌ర్ తో స్టార్ట్ చేసారు.. మేకింగ్ ప‌రంగా యు.వి క్రియోష‌న్స్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదనే విష‌యం టీజ‌ర్ చూసిన ప్ర‌తిఓక్క‌రూ చెప్పె మాట‌.. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామెజిఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. అన్ని కార్క‌క్ర‌మాలు పూర్త‌చేసి విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. మా బ్యాన‌ర్ లో శ‌ర్వానంద్ హీరోగా చేస్తున్న మూడ‌వ చిత్రం మ‌హ‌నుభావుడు. కేర‌క్ట‌రైజేష‌న్ తో కామెడి పండించ‌గల చాలా అరుదైన ద‌ర్శ‌కుల్లో మారుతి ప్ర‌ద‌ముడు. ఈరోజు విడుద ల చేసిన మా టీజ‌ర్ చూస్తే కామెడి ఏ రేంజిలో ఉండ‌బోతుందో అర్ద‌మ‌వుతుంది. ట్రైల‌ర్ ని త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాము. ఓక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్త‌యింది. ఈరోజు నుండి డ‌బ్బింగ్ కార్క‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాము. విదేశాల్లో, ఇండియాలో ని ప‌లు ప్ర‌దేశాల్లో చిత్రాన్ని షూట్ చేశాము. శ‌ర్వానంద్ కి మాబ్యాన‌ర్ లో మ‌రో మంచి చిత్రంగా మ‌హ‌నుభావుడు నిలుస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.
ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం త‌రువాత నాకు బాగా న‌చ్చిన కేర‌క్ట‌రైజేష‌న్ తొ చేస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు. ఈరొజు విడుద‌ల‌య్యిన టీజ‌ర్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంది. చూసిన వారంద‌రూ ఈ చిత్రం మ‌ళ్ళి నీస్టైల్లో కామెడి ఫుల్ గా వుంటుంది అని చెబుతున్నారు. శ‌ర్వానంద్ కెరీర్ లో ఈ చిత్రం బెస్ట్ చిత్రం గా నిలుస్తుంద‌ని నమ్మ‌కం వుంది. శ‌ర్వానంద్ చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడి వుంటుంది. థ‌మ‌న్ సూప‌ర్ ఆడియో అందించాడు. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా ఈ చిత్రం వుంటుంది. ద‌స‌రా కి విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. అని అన్నారు.
న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు..

సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.