ఎన్టీఆర్ బ‌యోపిక్‌: శ‌ర్వానంద్ ఔట్‌

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ‌ర్వానంద్ న‌టించ‌బోతున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. శ‌ర్వా కూడా `న‌న్ను సంప్ర‌దించిన మాట నిజ‌మే` అని ఓ సంద‌ర్భంలో చెప్పాడు కూడా. యుక్త వ‌య‌సులో ఉన్న ఎన్టీఆర్ గా శ‌ర్వా క‌నిపిస్తాడ‌ని చెప్పుకున్నారు. అయితే… ఈ ప్రాజెక్టులో శ‌ర్వా లేడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. శ‌ర్వా ద‌గ్గ‌ర‌కు ఆఫ‌ర్ వెళ్లిన సంగ‌తి నిజ‌మేన‌ని, శ‌ర్వా కూడా `చేస్తా` అని మాట ఇచ్చాడ‌ని, అయితే ఏమైందో ఏమో… ఇప్పుడు శ‌ర్వా ఈ ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ని చెబుతున్నారు. శ‌ర్వా `నో` చెప్ప‌డానికి కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేదు. శ‌ర్వా వ‌ద్ద‌నుకోవ‌డం వ‌ల్లే… మోక్ష‌జ్ఞ ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టాడ‌ని, యుక్త వ‌య‌సు ఎన్టీఆర్‌గా మోక్షూ క‌నిపించే ఛాన్సులే ఎక్కువ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ చాలా బొద్దుగా ఉన్నాడు. ఈ పాత్ర మోక్షూ చేయాలంటే.. బాగా స‌న్న‌బ‌డాలి. మోక్ష‌జ్ఞ కూడా ప్ర‌స్తుతం ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నాడ‌ని స‌మాచారం. ఒక‌వేళ షూటింగ్ స‌మ‌యానికి మోక్ష‌జ్ఞ రెడీ అవ్వ‌క‌పోతే.. ఆ స్థానంలో మ‌రో యువ హీరో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close