`రాధ‌` ఆ `బాధ‌` త‌క్కువే!

ఓ సినిమా పోతే…. నిర్మాత‌, కొన్న‌వాళ్లు దారుణంగా న‌ష్ట‌పోవాల్సిందే. రూపాయికి రూపాయి పోవ‌డం మిన‌హా మ‌రో మార్గం లేదు. కాక‌పోతే… బ‌డ్జెట్ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే ఆ న‌ష్టాన్ని వీలైనంత త‌గ్గించుకోవొచ్చు. `రాధ‌` విష‌యంలో అదే జ‌రిగింది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన `రాధ‌`కి నెగిటీవ్ టాక్ ఇబ్బంది పెట్టింది. `బాహుబ‌లి 2` ప్ర‌భంజ‌నంలో నెగిటీవ్ టాక్ కాస్త వ‌చ్చినా దాని ఎఫెక్ట్స్ దారుణంగా ఉంటుంది. కాక‌పోతే శ‌ర్వా సినిమా కాబ‌ట్టి మినిమం వ‌సూళ్లు తెప్పించుకోగ‌లిగాడు. అనుకొన్న బ‌డ్జెట్‌లో సినిమా తీయ‌డం, స్టార్ కాస్టింగ్‌కి ఎక్కువ ఖ‌ర్చు పెట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల నిర్మాత న‌ష్టాల నుంచి త‌ప్పించుకోగ‌లిగాడు. అన్నింటికంటే ముఖ్యమైన విష‌యం ఏంటంటే `శ‌త‌మానం భ‌వ‌తి` విడుద‌ల‌కు ముందే… `రాధ‌` బిజినెస్ పూర్త‌య్యింది. `శ‌త‌మానం..` ఎఫెక్ట్ లేదు కాబ‌ట్టి.. శ‌ర్వా సినిమాని మినిమం రేట్ల‌కు అమ్ముకోగ‌లిగారు. శాటిలైట్ ప‌రంగా రూ.4 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. టేబుట్ ప్రాఫిట్ కూడా బాగానే మిగిలింద‌ట‌. డిస్టిబ్యూట‌ర్లు రీజ‌న‌బుల్ రేట్లకే ఈ సినిమాని కొన్నారు కాబ‌ట్టి.. భారీ న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారు. అయితే శ‌ర్వా త‌దుప‌రి సినిమాల‌పై మాత్రం `రాధ‌` ఎఫెక్ట్ ఉండొచ్చు. మ‌రి దాని స్థాయి ఎంత‌?? అనేది తెలియాలంటే మాత్రం కొంత‌కాలం ఓపిక ప‌ట్టాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com