రిపేర్లకు ‘శ్రీ‌కారం”

ర‌ణరంగం, ప‌డి ప‌డి లేచె మ‌న‌సు సినిమాల‌తో వ‌రుస ఫ్లాపులు మూట‌గ‌ట్టుకున్నాడు శ‌ర్వానంద్‌. జానూలో శ‌ర్వా న‌ట‌న బాగానే ఉన్నా, క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ… `శ్రీ‌కారం` సినిమాపైనే. కిషోర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్ర‌మిది. ప్రియాంకా మోహ‌న్ క‌థానాయిక‌. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇందులో శ‌ర్వా.. రైతుగా క‌నిపించ‌బోతున్నాడు. రైతుల స‌మ‌స్య‌ని ప్ర‌ధానంగా ఎంచుకుని తెర‌కెక్కించిన చిత్ర‌మిది.

ఈ సినిమా రషెష్ చూసుకుంటే శ‌ర్వాకి కొన్ని లోటు పాట్లు క‌నిపించాయ‌ట‌. ల‌వ్ స్టోరీ మ‌రీ డ‌ల్‌గా ఉంద‌ని అనిపించింద‌ట‌. అలా డ‌ల్‌గా అనిపించిన సన్నివేశాల్ని మ‌ళ్లీ కొత్త‌గా రాసుకుని తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. పైగా సినిమాని మ‌రింత షార్ప్‌గా క‌ట్ చేయాల‌ని భావిస్తున్నారు. సందేశాల పేరుతో ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు లేకుండా కొన్ని చోట్ల‌… బాగా ట్రిమ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల‌త బ‌య‌ట‌కు వ‌చ్చింది. లుంగీ క‌ట్టిన శ‌ర్వా.. గెట‌ప్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సందేశంతో పాటు వినోదాన్ని, ఓ మంచి ప్రేమ‌క‌థ‌నీ ఇందులో మిళితం చేశార్ట‌. ప్ర‌స్తుతం వాటికి సంబంధించిన రిపేర్లే మొద‌ల‌య్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close