శిల్పాషెట్టి నిందితురాలే..!?

రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ వ్యాపారంలో శిల్పాషెట్టికి కూడా భాగం ఉందని పోలీసులు ఆధారాలు సేకరించారు. రాజ్ కుంద్రా, శిల్పాషెట్టి దంపతులు తమ కుమారుడి పేరు మీదనే వివియాన్ అనే కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరు మీదుగానే యాప్‌లు రూపొందించి… పోర్న్ ఫిల్మ్స్ బిజినెస్ చేస్తున్నారు. ఈ కంపెనీలో శిల్పాషెట్టి కూడా ఓ డైరక్టర్. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత శిల్పాషెట్టి.. డైరక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె ఇంట్లో… కార్యాలయాల్లో ముంబై పోలీసులు ఆరు గంటలకుపైగా సోదాలు చేశారు. అనేక రికార్డు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో ఇంకా చాలా పోర్న్ క్లిప్స్ ఉన్నాయని చెబుతున్నారు.

అదెంత వరకు నిజమో కానీ.. ప్రస్తుతం శిల్పాషెట్టి కేంద్రంగానే ముంబై పోలీసుల విచారణ జరుగుతోంది. ఆమెకు ఎక్కడైనా లింకులు ఉన్నాయా.. ఎక్కడైనా ఆ యాప్ ల నుంచి లావాదేవీల్లో డబ్బులు అందాయా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. శిల్పాషెట్టికి తెలియకుండా రాజ్ కుంద్రా ఇలాంటి వ్యాపారం చేయరని.. అంటున్నారు. ఎందుకంటే.. రాజ్ కుంద్రా.. సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. శిల్పాషెట్టిని పెళ్లి చేసుకున్న తర్వాతనే ఆయన బాలీవుడ్‌ బిజినెస్‌లోకి వచ్చారు.

కాబట్టి… శిల్పాషెట్టి పాత్ర ఉండే ఉంటుందని అంచనాలు వేసుకుని.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. నేడో రేపో ఆమె పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది ఈ కేసు మొత్తం ఓ ఫార్స్ అని.. తాము పోర్న్ వీడియోలు చిత్రీకరించడం లేదని.. వెబ్ సీరిస్‌లే చిత్రీకరిస్తున్నామని రాజ్ కుంద్రా వాదిస్తున్నారు. ఇదే వాదన న్యాయస్థానాల్లోనూ వినిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close