బీజేపీకి శివసేన షాక్

మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మిత్ర పక్షం శివసేన దూకుడు కమలనాథులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కల్యాణ్, డోంబీవలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది.

కేంద్రంలో, మహారాష్ట్ర కేబినెట్లో మిత్రపక్షాలుగా ఉంటూనే కత్తులు దూస్తున్నశివసేన, బీజేపీలు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. మొత్తం 122 సీట్లలో శివసేన 52 సాధించింది. బీజేపీకి 41 సీట్లు దక్కాయి. 2010 లో ఈ రెండూ పార్టీలూ కలిసి 40 సీట్లు గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ల మద్దతుతో కార్పొరేషన్లో పాగా వేశాయి. ఈసారి ఎన్నికల్లో మరో విశేషం ఏమిటంటే, శివసేనకు చెందిన మేయర్, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ నాలుగు సీట్లు మాత్రమే గెల్చుకుంది. ఎన్సీపీకి రెండు మాత్రమే దక్కాయి. ఇక, శివసేనకు పోటీగా ఎదగాలని తహతహలాడుతున్న రాజ్ థాకరే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కూడా భారీగా నష్టపోయింది. 2010లో ఆ పార్టీ 27 సీట్లు గెల్చుకుంది. ఈసారి 8 సీట్లకే పరిమితమైంది.

మహారాష్ట్రలోనే కొల్హాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీలు మంచి ఫలితాలు సాధించాయి. వేర్వేరుగా పోటీ చేసినా, రెండు పార్టీలకూ వచ్చిన సీట్లు 42. తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ఫలితాలు వెలువడగానే ఎన్సీపీ ప్రకటించింది. ఇక్కడ బీజేపీ మరో స్థానిక ప్రాంతీయ పార్టీతో కలిసి 32 సీట్లను గెల్చుకుంది.

ఈ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేకపోయినా కల్యాణ్, డోంబీవలిలో శివసేన పైచేయి సాధించడం కమలనాథులకు మింగుడు పడటం లేదు. అయితే, సేనకు సొంతంగా మెజారిటీ రాలేదు. కాబట్టి బీజేపీ మద్దతును కోరక తప్పక పోవచ్చు. కేంద్రం, రాష్ట్రంలో ఎలాగూ మిత్రపక్షాలే కాబట్టి, మళ్లీ రెండూ కలిసి కార్పొరేషన్లో పాగా వేసినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close