ఫ్యాన్స్ కు షాకిచ్చిన ప‌వ‌న్…?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సంక్రాంతి పండుగ‌కి ఫ్యాన్స్ కి ఓ అద్భుత‌మ‌మైన గిఫ్ట్ ఇచ్చాడు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ టీజ‌ర్ ని రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేశాడు. అయితే.. ఈ టీజ‌ర్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచ‌నాల‌ను మాత్రం రీచ్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.

త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా 2015లో రిలీజ్ చేసిన స‌ర్దార్ ఫ‌స్ట్ లుక్ కి, లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజ‌ర్ కి పెద్ద‌గా తేడా లేదు. అప్పుడేమో.. సైడ్ నుంచి గుర్రాన్ని ప‌ట్టుకుని వ‌స్తున్న ప‌వ‌న్ క‌నిపించాడు. ఇప్పుడేమో ఫ్రంట్ నుంచి గుర్రాన్ని ప‌ట్టుకుని వ‌స్తున్నట్టుగా ఉంది. ఈ రెండింట్లోనూ పెద్ద తేడా ఏం లేదు. అయితే ఒక్క పాయింట్ మాత్రం క‌చ్చితంగా ఉంది..

తాజా టీజ‌ర్ లో ప‌వ‌న్ గ‌ళ్ల లుంగీ హైలెట్ గా ఉంది. తెలుగు వారి అచ్చ‌తెలుగు పండుగ సంక్రాంతికి.. తెలుగు సంప్రదాయ‌బ‌ద్ధంగా ప‌వ‌న్ లుంగీ టీజ‌ర్ మాత్రం కేకపుట్టించింది. ఆ ఒక్క పాయింట్ మాత్రం టీజ‌ర్ ని ఫ్యాన్స్ కి క‌నెక్ట్ అయ్యేలా చేసింది. అయితే ప‌వ‌న్ ఓ డైలాగ్ చెబుతాడ‌నో, ఓ డాన్స్ స్టెప్ వేస్తాడ‌నో ఆశించిన అభిమాన కోటికి మాత్రం కొంచెం నిరాశే మిగిలింది.

అయితే గోపాల గోపాల‌లో చెప్పిన‌ట్టు.. కొన్నిసార్లు.. ఫ్యాన్స్ ఆశించిన అంశం లేట్ అవ్వొచ్చు. కానీ రావ‌డం మాత్రం ప‌క్కా. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ఇంకా నాలుగు నెల‌లు టైమ్ ఉంది కాబ‌ట్టి మ‌ధ్య‌లో ట్రైల‌ర్ రూపంలో మ‌రోసారి రావ‌డం మాత్రం ఖాయం. అప్ప‌టి వ‌ర‌కు ఈ టీజ‌ర్ తో పండుగ చేసుకోవ‌డ‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com