తెలుగు మాస్టారుగా ప్ర‌భాస్‌

శీర్షిక చూసి… బ‌డిపంతులు, మాస్ట‌ర్ టైపు క‌థలో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడేమో అనుకోవొద్దు. ప్ర‌భాస్ తెలుగు మాస్టారు అవ‌తారం ఎత్తింది తెర‌పై కాదు. నిజంగానే. ప్ర‌భాస్ ఓ క‌థానాయిక‌కు తెలుగు పాఠాలు నేర్పిస్తున్నాడు. మేట‌ర్‌లోకి వెళ్తే.. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సాహో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్ర‌ద్దా క‌పూర్ క‌థానాయిక‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. శ్ర‌ద్దాకి ఇదే తొలి తెలుగు సినిమా. తెలుగు భాష అస్స‌లు తెలీదు. అందుకే.. ప్ర‌భాస్ ద‌గ్గ‌రుండి తెలుగు డైలాగుల‌కు హిందీలో అర్థం చెబుతున్నాడ‌ట‌. ప్ర‌భాస్‌కి హిందీ కొంచెం కొంచెం వ‌చ్చు. అయితే.. హిందీ వెర్ష‌న్‌కు మాత్రం.. శ్ర‌ద్దా ప్ర‌భాస్‌కి స‌హాయం చేస్తోంద‌ట‌. సాహోని హిందీలోనూ విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇదేదో డ‌బ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్ర‌యిట్ హిందీ సినిమాల‌నే విడుద‌ల చేయాల‌న్న‌ది నిర్మాత‌ల వ్యూహం. అందుకే తెలుగు వెర్ష‌న్ షూట్ చేసిన వెంట‌నే హిందీ వెర్ష‌న్ కూడా తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు వెర్ష‌న్ కోసం ప్ర‌భాస్ సాయం చేస్తున్న‌ట్టే, హిందీ వెర్ష‌న్ కోసం శ్ర‌ద్దాక‌పూర్ సాయం చేస్తోంద‌ట‌. మొత్తానికి ఇద్ద‌రూ గురువులైపోయారు. అన్న‌ట్టు ఈరోజు గురు పౌర్ణ‌మి క‌దా?? ఈ గురువులిద్ద‌రికీ శుభాకాంక్ష‌లు చెప్పేద్దామా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.