శ్రియ డేట్లు… డిస్కౌంట్ ఆఫర్లు!

శ్రియ మీడియాకు చుక్కలు చూపిస్తుంది కానీ దర్శక నిర్మాతలకు కాదు. అందుకే ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక సినిమా చేస్తుంటుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పుష్కరం దాటినా ఫిట్నెస్, సెక్సీనెస్ విషయాల్లో కొత్త హీరోయిన్లకు శ్రియ పోటీ ఇస్తుంది. శ్రియకు ఇంకా ఛాన్సులు రావడంలో ఫిగర్‌తో పాటు యాక్టింగ్, రెమ్యునరేషన్ విషయంలో ఫ్రెండ్లీ ఆటిట్యూడ్ కీలక భూమిక పోషిస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.

ఇప్పుడు శ్రియ చూపు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ క్యారెక్టర్లపై లేదు. కథలో కీ రోల్ అన్పిస్తే చాలు… చలో అంటూ సంతకం పెడుతున్నారు. పది పదిహేను రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుంది. రెమ్యునరేషన్ కూడా అందుకు తగ్గట్టు రోజుల లెక్కన తీసుకుంటున్నారట. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అయితే ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఉంటుంది. రోజుల లెక్కన అయితే తగ్గుతుంది. లేదా ఒక రోజు అటు ఇటుగా వేసుకుని ముందే ఇంత అమౌంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. శ్రియ ఇస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్స్ సినిమా జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. లాస్ట్ మినిట్ లో, కొన్ని సినిమాలు షూటింగ్ మొదలైన తర్వాత శ్రియ పేరు యాక్టర్స్ లిస్టులో చేరడం వెనుక మతలబు ఇదే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ రుచి చూసిన హీరోయిన్, జనాల్లో ఇప్పటికీ అంతో ఇంతో క్రేజ్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ చూశాక ఎవరు మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఉంటారు!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, శర్వానంద్, అల్లరి నరేష్, తరుణ్… ఆల్మోస్ట్ అందరి హీరోలతోనూ శ్రియ నటించింది. ఆఖరికి సినిమాలు ఆపేసిన ‘ఆనంద్’ ఫేమ్ రాజాతో ఒకటి, యంగ్ హీరో రామ్ ఫస్ట్ ఫిల్మ్ ‘దేవదాసు’లో ఐటమ్ సాంగ్ చేసింది. శ్రియ స్పీడు చూస్తుంటే ఇప్పుడు మరోసారి అందరితో హీరోయిన్ గా కాకపోయినా ఏదో ఒక పాత్రలో వాళ్ళ సినిమాలు చేసేలా కనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.