పంతం నెగ్గించుకొన్న ప‌వ‌న్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా ఎస్‌.జె సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌. బ‌డ్జెట్ ప‌రిమితుల్ని దృష్టిలో ఉంచుకొని నూత‌న క‌థానాయితో ఈసినిమాని లాగించేద్దాం అనుకొన్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం.. స్టార్ హీరోయినే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. అందులోనూ శ్రుతిహాస‌న్ పేరుని ప్ర‌తిపాదించాడ‌ట‌. దాంతో.. శ్రుతి కాల్షీట్ల కోసం ఆరా తీయ‌క‌త‌ప్ప‌లేదు. ఇప్పుడు శ్రుతిహాస‌న్‌నే ఖాయం చేసేశారు. ”మా సినిమాలో శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది” అంటూ చిత్ర‌బృందం కూడా అధికారికంగా ప్ర‌క‌టించేసింది. అలా.. గ‌బ్బ‌ర్‌సింగ్ కాంబినేష‌న్ మ‌ళ్లీ సెట్ట‌య్యింద‌న్న‌మాట‌.

వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఇదో ఫ్యాక్ష‌నిస్టు ప్రేమ‌క‌థ అని చిత్ర‌బృందం తెలిపింది. ఓ త‌మిళ చిత్రానికి రీమేక్ అన్న ప్ర‌చారం జ‌రుగుతున్నా… అదేం కాదని, ఇది కొత్త క‌థే అని చిత్ర‌బృందం చెబుతోంది. ఆకుల శివ క‌థా మాట‌లు స‌మ‌కూరుస్తున్నారు. అనూఫ్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close