శ్రుతికి ఆ ఛాన్స్ కూడా మిస్స‌యిపోయింది

శ్రుతి హాస‌న్‌ తెలుగులో ఓ సినిమా చేసి చాలా కాల‌మైంది. అలాగ‌ని మిగిలిన భాష‌ల్లో తానేదో బిజీ బిజీగా ఉన్న‌ట్టు కాదు. అన్ని చోట్లా ఆమెకు గుర్తింపు ఉన్నా, ఒక్క చోట ఒక్క సినిమా కూడా ద‌క్కించుకోలేకపోయింది. దాదాపుగా ఫేడ‌వుట్ అయిపోతున్న క‌థానాయిక‌ల్లో శ్రుతి కూడా చేరిపోయింది. అయితే…. చిరంజీవి – కొర‌టాల శివ సినిమాలో ఆమెకు ఛాన్స్ వ‌చ్చింద‌ని, ఇది త‌న‌కు రీ ఎంట్రీ లాంటి సినిమా అని చెప్పుకున్నారు. అయితే ఆ సినిమా అవ‌కాశం కూడా తృటిలో త‌ప్పిపోయింది. కొర‌టాల శివ సినిమా కోసం శ్రుతి పేరు ప‌రిశీలించిన మాట వాస్త‌వ‌మే. అయితే… చిరు ప‌క్క‌న శ్రుతి జోడీ అంత క‌రెక్ట్ కాద‌ని కొర‌టాల భావించాడ‌ని, అందుకే.. శ్రుతి పేరు ప‌క్క‌న పెట్టేశార‌ని రూఢీ అయ్యింది. ఇప్పుడు శ్రుతి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈ విష‌యాన్ని శ్రుతి కూడా ఒప్పుకుంది. అయితే.. త‌న‌కు అవ‌కాశాలు రావ‌డం లేద‌న్న బెంగ లేద‌ని, త‌న దృష్టి పూర్తిగా సంగీతంపైనే ఉంద‌ని, న‌టిగా త‌న‌కు మ‌రో బ్రేక్ త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో శ్రుతి మ‌ళ్లీ రేజ్‌లోకి రావ‌డం క‌ష్ట‌మే. దాదాపుగా త‌న‌కు అవ‌కాశాలు మూసుకుపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close