ఇది మ‌జిలీ ‘ల‌వ్ స్టోరీ’నేనా?

నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం `మ‌జిలీ`. భ‌ర్త బేవార్సు.. భార్య ఉద్యోగ‌స్థురాలు. అదే మ‌జిలీ క‌థ‌. స‌హ‌జ‌నంతో భ‌ర్త‌ని ప్రేమ‌తో మార్చుకుంటుంది. ఇప్పుడు నాగ‌చైత‌న్య – సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులోనూ సేమ్ అదే లైన్ అని స‌మాచారం. కాక‌పోతే…. చైతూ – సాయి ప‌ల్ల‌వి భార్యాభ‌ర్త‌లు కాదు. జ‌స్ట్‌… ప్రేమికులు.

చైతూ ఉద్యోగం లేక డీలాగా ఉంటాడు. ఆవారాగా తిరుగుతుంటాడు. సాయిప‌ల్ల‌వి ఉద్యోగ‌స్థురాలు. ఏ గ‌మ్య‌మూ లేకుండా నాగ‌చైత‌న్య‌ని.. సాయి ప‌ల్ల‌వి ఎలా మార్చిందన్న‌దే క‌థ‌. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల్లో గొప్ప గొప్ప పాయింట్లే ఉండ‌వు. భావోద్వేగాలూ, అనుభూతులే క‌నిపిస్తాయి. అందుకే తాను ఇది వ‌ర‌కు చేసిన క‌థ‌నే అయినా… మ‌ళ్లీ ఒప్పేసుకున్నాడేమో. `మ‌జిలీ`లో ఇంట్ర‌వెల్ త‌ర‌వాత సినిమా మొత్తాన్ని స‌మంత త‌న వైపుకు తిప్పుకుంటుంది. అయితే.. `ల‌వ్ స్టోరీ`లో మాత్రం ముందు సీన్ నుంచి సాయి ప‌ల్ల‌వినే డామినేట్ చేస్తుంటుంద‌ట‌. ఈ రెండు సినిమాల మ‌ధ్యా.. అదో వ్య‌త్యాసం ఉంది. మ‌రి.. `మ‌జిలీ`లోనూ `ల‌వ్ స్టోరీ`లోనూ ఇంకెన్ని పోలిక‌లు క‌నిపిస్తాయో.. సినిమా విడుద‌ల‌య్యేక లెక్క‌లేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close