మ‌న‌సులు దోచిన సీత‌

తెలుగు చిత్రసీమ‌లోకి ఎంతోమంది క‌థానాయిక‌లు వ‌స్తుంటారు…. వెళ్తుంటారు. కానీ చాలా త‌క్కువ‌మందే త‌మ‌దైన స్థానాన్ని సంపాదించుకుంటారు. తొలి సినిమాతోనే అంద‌రి మ‌న‌సుల్నీ కొల్ల‌గొట్ట‌డం అంతే తేలికైన విష‌యం కాదు. అలా… ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తాన్ని త‌న వైపు తిప్పుకొంది.. మృణాల్ ఠాకూర్‌. సీతారామంలో సీత‌గా చ‌క్క‌ని అభిన‌యం ప్ర‌ద‌ర్శించి తొలి చూపులోనే అంద‌రికీ ద‌గ్గ‌రైపోయింది. మృణాల్ అందం, ఆహార్యం, ఆ పాత్ర‌లోకి ఒదిగిపోయిన విధానం.. ఇవ‌న్నీ ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల్ని మంత్ర ముగ్థుల్ని చేస్తున్నాయి. ఈ సినిమాతో మృణాల్ మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

నిజానికి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మృణాల్ పేరు అస్స‌లు తెలీదు. తాను చేసిన హిందీ సినిమాలు ఒక‌ట్రెండు బాగానే ఆడాయి కానీ, అవేం తెలుగు ప్రేక్ష‌కుల వ‌ర‌కూ రాలేదు. వైజ‌యంతీ మూవీస్ కోరుకుంటే, ఎంత‌టి స్టార్ హీరోయిన్‌ని అయినా, త‌న టీమ్‌లోకి తీసుకుంటుంది. అయితే ఏరి కోరి మృణాల్ ని ఎంపిక చేయ‌డం, సీతారామంలో ర‌ష్మిక ఉన్నా, త‌న‌ని ఓ కీల‌క‌మైన పాత్ర‌కి ప‌రిచ‌యం చేయ‌డం.. ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ర‌ష్మిక ఉన్న‌ప్ప‌టికీ.. ఓ కొత్త అమ్మాయికి హీరోయిన్ గా స్థానం ఎలా క‌ల్పించారా? అని అంద‌రూ ముక్కున వేలేసుకొన్నారు. అయితే… ఇప్పుడు మృణాల్ త‌న అందంతో, అభిన‌యంతో అంద‌రి అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేసింది. సీతగా నూటికి నూరు మార్కులూ సంపాదించుకొంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌తో మృణాల్ కెమిస్ట్రీ సీతారామం సినిమాకే హైలెగా మారింది. త్వ‌ర‌లోనే తెలుగు చిత్ర‌సీమ‌లో ఓ అగ్ర క‌థానాయిక‌గా చ‌లామ‌ణీ అయ్యే అన్ని లక్ష‌ణాలూ ఆమెలో క‌నిపిస్తున్నాయ‌ని అప్పుడే అంద‌రూ ఓ అంచ‌నాకు వ‌చ్చేశారు. మ‌రి ఈ విజ‌యాన్ని మృణాల్ ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close