పాప వ‌చ్చింది.. అంతా మంచే జ‌రుగుతుంది: మ‌హేష్‌

బ్రహ్మోత్స‌వం సినిమాకి ప‌నిచేడ‌యం వ‌ల్ల ఎంతో నేర్చుకొన్నాన‌ని, మ‌నిషిగా ఎదిగాన‌ని అంటున్నారు మ‌హేష్‌బాబు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం బ్ర‌హ్మోత్సవం. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోని గీతాలు కొద్ది సేప‌టి క్రితం హైద‌రాబాద్ జేఆర్‌సీ ఫంక్ష‌న్ హాల్‌లో విడుద‌ల‌య్యాయి. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ ఆడియో ఫంక్ష‌న్‌ని మ‌హేష్ కుమార్తె సితార కూడా హాజ‌రైంది. సితార మ‌హేష్ ఆడియో ఫంక్ష‌న్ల‌కు రావ‌డం ఇదే తొలిసారి. ఆ సెంటిమెంట్‌పై మ‌హేష్ న‌మ్మ‌కంగా ఉన్నాడు. పాప సితార నా ఆడియోకి రావ‌డం ఇదే తొలిసారి, అంతా మంచే జ‌రుగుతుంద‌ని మ‌హేష్ అభిల‌షించాడు.

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుతో ఎంతో నేర్చుకొన్నాన‌ని, ఈ సినిమాతో ఇంకా ఎదిగాన‌ని మ‌హేష్ చెబుతున్నాడు. శ్రీ‌కాంత్ అడ్డాల లాంటి ద‌ర్శ‌కుడితో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌ని ఉంద‌న్నాడు మ‌హేష్‌. త‌న‌ని ఇంత‌వాడ్ని చేసింది అభిమానులే అన్నాడు. ”నిజంగా ఒక‌రిపై మ‌న‌కు ప్రేమ ఉంటే, ఆ ప్రేమ‌ని మాట‌ల్లో వ్య‌క్త‌ప‌ర‌చ‌లేం. అభిమానుల గురించి నేను అందుకే పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడ‌లేను. వాళ్లే న‌న్ను ఇంత‌టి వాడ్ని చేశారు” అని అభిమానుల‌పై త‌న ప్రేమ కురిపించాడు మ‌హేష్‌. 20 వ తారీఖున సిద్దంగా ఉండండి, థియేట‌ర్లో ఉత్స‌వం చేసుకొందాం.. అని రిలీజ్ డేట్ కూడా డిక్లేర్ చేయ‌డంతో జేఆర్‌సీ హాలు హోరెత్తింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close