అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ చంద్రబాబు..!

అడిగినప్పుడల్లా అవకాశం ఇవ్వడానికి ఇదేమైనా ఖవ్వాలి డాన్సా..? … ప్రతిపక్ష నేత చంద్రబాబు .. ఇంగ్లిష్ మీడియంపై జరుగుతున్న చర్చలో.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ… అడిగినప్పుడు గౌరవనీయమైన స్పీకర్.. స్పందన. అసెంబ్లీలో చర్చలను.. స్పీకర్ ఖవ్వాలి డాన్సులతో పోల్చారనో.. మరో కారణమో.. కానీ.. చంద్రబాబు ఈ మాటలు విన్న తర్వాత ఫైరయ్యారు. స్పీకర్ స్థానంలో ఉండి ఇలా మాట్లాడితే … మర్యాదగా ఉండదన్నారు. చంద్రబాబు మర్యాదగా ఉండదని అనడంతో.., స్పీకర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రతిపక్ష నేత స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పీకర్ చైర్‌ను అవమానించారన్నారు. ఇష్టానుసారం స్పీకర్‌పై ఆరోపణలు చేస్తే మంచిది కాదన్నారు. స్పీకర్‌ చైర్‌ను చంద్రబాబు ఏమాత్రం గౌరవించడం లేదన్నారు. ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. స్పీకర్ ఆగ్రహానికి తగ్గట్లుగా.. వైసీపీ సభ్యులు.. లేచారు. ఒక్కొక్కరు లేచి.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించి., జోగి రమేష్ అయితే.. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. చంద్రబాబను సభ నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు.

ఇంగ్లిష్ మీడియంపై జరుగుతున్న చర్చ.. ఒక్క సారిగా.. స్పీకర్ వ్యాఖ్యలు.. ఆ తర్వాత చంద్రబాబు ఆగ్రహం వంటి అంశాలపై వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారం… పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. టీడీపీ సభ్యులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఆ ఆగ్రహం ఇప్పుడు.. చంద్రబాబు మాటల్లో వ్యక్తమైందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close