నవంబర్ 27న విడుదలవుతున్న ‘శివ గంగ’

శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మీ, సుమన్‌, మనోబాల, వడివుక్కరసి ముఖ్యపాత్రధాయిగా రూపొందిన చిత్రం ‘శివగంగ’. కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.సి.వడి ఉడయాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘అరుంధతి’, ‘కాంచన’, ‘చంద్రముఖి’, ‘గంగ’, ‘చంద్రకళ’ చిత్రాల తరహాలో ఈ సినిమా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తెలుగు, తమిళంలో నవంబర్ 27న గ్రాండ్ లెవల్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా…

చిత్ర సమర్పకుడు కుమార్‌ బాబు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం తెలుగు, తమిళంలో హర్రర్‌ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా మా ‘శివ గంగ’ చిత్రం కూడా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో సినిమాని రూపొందించాం. అన్నీ కమర్షియల్‌ హంగులతో, ఉహించని ట్విస్ట్ లతో సినిమా సాగుతుంది. రెండు ఆత్మల ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుంది. తెలుగు, తమిళ ప్రేక్షకకులకు సుపరిచితుడైన నటుడు శ్రీరామ్‌ ఇందులో శివ, శక్తి అనే రెండు రోల్స్ ను పోషించాడు. అలాగే రాయ్‌లక్ష్మీ కూడా గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ చేసింది. 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. సీనియర్‌ నటుడు సుమన్‌ నెగటివ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ లెవల్ లో సినిమాను నవంబర్ 27న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాతలు కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుండి తొలి చిత్రంగా రానున్న భారీ బడ్జెట్‌ మూవీ ‘శివ గంగ’. హర్రర్‌ , యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ మూవీ రూపొందింది. డైరెక్టర్‌ వి.సి.వడి ఉడయాన్‌ సినిమాని ఎక్సలెంట్‌గా తెరకెక్కించారు. హై టెక్నికల్‌ వాల్యూస్ ఉన్న చిత్రం. కనల్‌ కణ్ణన్‌ ఫైట్స్‌, జాన్‌ పీటర్‌ మ్యూజిక్‌, ఎస్‌.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ 27న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మి, సుమన్‌, వడివుక్కరసి, రేఖ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్‌: కణల్‌ కన్నన్‌, సంగీతం: జాన్‌ పీటర్‌, కెమెరా: ఎస్‌.శ్రీనివాసరెడ్డి, మాటలు: ఎం.రాజశేఖర్‌రెడ్డి, పాటలు: వనమాలి, వెలిదండ్ల, ఎడిటర్‌: ఎలీనా, ఆర్ట్‌: దేవరాజ్‌, నిర్మాతలు: కె.శివనాథ్‌, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: వి.సి.వడి ఉడయాన్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close