సమీక్ష : అనుష్కకు హ్యాట్రిక్ ‘సైజ్ జీరో’

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న అనుష్క లేటెస్ట్ గా ‘సైజ్ జీరో’ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రుద్రమదేవి తర్వాత పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి అనుభూతిని కలిగించిందో సైజ్ జీరో సమీక్షలో చూద్దాం.

కథ:

బొద్దుగా ఉండే అమ్మాయి స్వీటీ (అనుష్క) తన తండ్రి చెప్పినట్టుగా సంతోషాన్ని, బాధలని దేవుడు ఇస్తాడని వేయింగ్ మిషన్ ఇచ్చే సదేషాలతో కాలం గడుపుతుంటుంది. స్వీటీకి పెళ్లి చేయాలని ఆమె తల్లి (ఊర్వశి) తెగ ప్రయత్నాలు చేస్తుంది. చాలా సంబంధాలను చూసిన స్వీటీని రిజక్ట్ చేయడమే జరుగుతుంది. అనుకోకుండా తన ఫ్రెండ్ ద్వారా స్వీటికి పెళ్లి చూపులు ఏర్పాటుచేస్తుంది ఊర్వశి. అయితే ఈసారి వచ్చింది మాత్రం అభి (ఆర్య) తనకు ఇప్పుడే పెళ్లంటే ఇష్టంలేని కారణం చేత అనుష్క చేతే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిస్తాడు. పెళ్లి కాదనుకున్నా వీరు స్నేహితులుగా మారడం.. అదే చిన్నగా ప్రేమగా మారడం జరుగుతుంది. అభికి డాక్యుమెంటరీల పిచ్చి దానికి సాయంగా సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) తోడవుతుంది. సిమ్రాన్ ప్రేమలో పడినట్టుగా కనిపించిన అభి ఇద్దరు కిస్ చేసుకుంటే చూసి హర్ట్ అవుతుంది స్వీటీ. ఇదంతా జరుగుంటే తనని కాదని సిమ్రాన్ వెంట పడటం ఈ తన వెయిట్ వల్లే అని నిజం తెలుసుకుంటుంది. ఓ పక్క ‘సైజ్ జీరో’ అంటూ ఎంత లావుగా ఉన్న వారినైనా సరే అతి తక్కువ టైంలో చాలా సన్నగా నాజూకుగా చేస్తామని సైజ్ జీరో అధినేత సత్యానంద్ (ప్రకాశ్ రాజ్) జనాలను మోసం చేస్తూ ఉంటాడు. అయితే ఈ మార్గంలోనే స్వ్టీటీ ఫ్రెండ్ సైజ్ జీరో వల్ల అనారోగ్యపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. అసలు సైజ్ జీరో మీద స్వీటీ ఎందుకు కక్ష కడుతుంది..? స్వీటీ ఫ్రెండ్ సైజ్ జీరో వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురవుతుంది..? సిమ్రాన్ ని ప్రేమించిన ఆర్య మళ్లీ స్వీటీని ఎలా ఇష్టపడతాడు..? అనేది అసలు కథ..

టెక్నికల్ డిపార్ట్ మెంట్ :

సినిమాకు పనిచేసిన అన్ని వర్గాల వారు సినిమాకు బెస్ట్ అవుట్ ఇచ్చారనే చెప్పొచ్చు. సినిమాకు పనిచేసిన నిరావ్ షా సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి ఫీల్ తీసుకువచ్చింది. కీరవాణి సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. రాఘవేంద్ర రావు కోడలు ప్రకాశ్ కోవెలమూడి భార్య కనిక అనుకున్న కథ సింపుల్ గానే ఉన్నా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రకాశ్ కోవెలమూడి డైరక్షన్ ఓకే అనిపించుకునేలా ఉంది. సినిమాకు మాటలు రాసిన కిరణ్ ఇంకాస్త బలమైన మాటలు రాస్తే బాగుండేది. గెట్ ఫిట్ డోంట్ క్విట్ అంటూ వచ్చే ప్రోగ్రాంలో వాడిన గ్రాఫిక్ ఎలిమెంట్స్ సినిమాకు మంచి జోష్ నింపాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేసిన ఈ సినిమా ఎక్కువ కత్తెరలు పడకుండా డీసెంట్ గా ఉంది. సినిమాలో సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా మంచి హెల్ప్ అయ్యాయి.

విశ్లేషణ :

వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వస్తున్న అనుష్క సైజ్ జీరో అంటూ వచ్చి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమా కోసం ఏకంగా 20 కిలల బరువు పెరిగిన అనుష్క సినిమా కోసం ఎలాంటి రిస్క్ నైనా చేసేందుకు సిద్దం అని చెప్పకనే చెప్పింది. ఇంత కష్టపడ్డది కాబట్టే సైజ్ జీరోలో అనుష్కని చూసి అందరు అవాక్కవుతున్నారు. సినిమా ఓవరాల్ గా అనుష్క పాత్రే ప్రధానం అని చెప్పాలి. లావుగా ఉన్న అమ్మాయిలు పడే సమస్యని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి. సినిమాలో ఆర్య చిన్న రోలే అయినా తన పాత్ర మేరకు బాగా చేశాడు. పివిపి బ్యానర్లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఏకంగా 1500 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.. సినిమాలో అనుష్క నటనే హైలెట్ అని చెప్పాలి. ప్రకాశ్ కోవెలమూడి డైరక్షన్ పర్వాలేదనిపించింది. లావుగా ఉండి సన్న పడడం కోసం అమ్మాయిలు పడే పాట్లు దాని కోసం వారిని తగ్గిస్తామని రకరకాల ప్రోగ్రాం తో వారిని మోసం చేసేవారి గురించి ఈ సినిమా చక్కగా చూపించారు. పివిపి బ్యానర్ కాబట్టి సినిమా అంతా చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో కనిపించి ప్రేక్షకులను అలరించింది. గెట్ ఫిట్ – డోంట్ క్విట్ అంటూ సైకిల్ తో చేసే ఎపిసోడ్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ ప్రోగ్రాంలో భాగంగా కింగ్ నాగార్జున, రానా, మంచు లక్ష్మి, తమన్న, హాన్సిక, జీవ, శ్రీదివ్యలు కూడా తళుక్కుమంటూ మెరిశారు.

ప్లస్ పాయింట్స్ :

అనుష్క నటన
డైరక్షన్
సంగీతం
గెట్ ఫిట్, డోంట్ క్విట్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ సింపుల్ గా ఉండటం
ఎడిటింగ్
స్లో నేరేషన్
మాస్ ఆడియెన్స్ కి నచ్చే అంశాలు లేకపోవడం
కామెడీ అంతగా ఆకట్టుకోలేకపోవడం

తీర్పు :

అనుష్క అనగానే సినిమా ఎలా ఉన్నా ఓసారి చూసొద్దాం అనేలా తన అభిమానులు థియేటర్ల బాట పడతారు. అయితే సైజ్ జీరో కోసం అనుష్క బొద్దుగా తయారయి మరి సినిమా చేసింది. సినిమాలో అన్నీ బాగున్నా సినిమా కథ ఇంకొంచం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది.. సినిమా మొత్తం ట్విస్ట్ ఏం లేకుండా సాఫీగా సాగటం కొంతమంది ఆడియెన్స్ కి రీచ్ అయినా అందరు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఉండదు. సినిమా కోసం స్వీటీ కష్టం నిజంగా మెచ్చుకోదగ్గది. లావుగా ఉన్న అమ్మాయిల సమస్యలను చెప్పే విధానంలో స్వీటీ తన అద్భుత నటన కనబరిచింది. సినిమా మాస్ ఆడియెన్స్ కి ఎక్కక పోవచ్చు. ఏది ఏమైనా ఇది ఓ కొత్త ప్రయోగం.. మంచి సినిమాలను ఆదరించే ప్రతి ఒక్క ప్రేక్షకుడు మెచ్చే సినిమా.. టైం పాస్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి కూడా సినిమా నచ్చుతుంది. బాహుబలి, రుద్రమదేవి హిట్ మేనియాని కంటిన్యూ చేస్తూ సైజ్ జీరో హిట్ తో అనుష్క హ్యాట్రిక్ కొట్టినట్టే లెక్క.

తెలుగు360 రేటింగ్ : 3/5
నటీనటులు : ఆర్య, అనుష్క, సోనాల్ చౌహాన్, ప్రకాశ్ రాజ్ తదితరులు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
కథ : కనిక థిల్లన్ (ప్రకాశ్ కోవెలమూడి భార్య)
దర్శకత్వం : ప్రకాశ్ కోవెలమూడి
నిర్మాత : పొట్లూరి వర ప్రసాద్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close