భారత మహిళా క్రికెట్ కెప్టెన్ స్మృతి మంధానా పెళ్లిని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించింది. పలాష్ మశ్చల్తో ఇక పెళ్లి ఉండదని ఇన్ స్టా లో ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై తీవ్ర చర్చలు-ఊహాగానాలు జరుగుతున్నాయి. నవంబర్ 23, 2025న జరగాల్సిన వివాహం చివరి క్షణంలో అనూహ్యంగా వాయిదా పడింది. స్మతి తండ్రి ఆస్పత్రి పాలయినందున పెళ్లి వాయిదా వేశామని చెప్పారు కానీ అది నిజం కాదని పూర్తిగా రద్దు చేసుకున్నారని ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లయింది.
గత కొన్ని వారాలుగా తన జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు జరుగుతున్నాయని…ఇప్పుడు మాట్లాడటం ముఖ్యమని భావిస్తున్నానని స్మృతి మంథాన ప్రకటించారు. తాను చాలా ప్రైవేట్ వ్యక్తిని, అలాగే ఉంచుకోవాలని కోరుకుంటున్నానన్నారు. కానీ వివాహం రద్దు అయిందని స్పష్టం చేయాల్సి ఉందని.. అందుకే ప్రకటిస్తున్నానని చెప్పారు. ఈ విషయాన్ని ఇక్కడ ముగించాలని, మీరు కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను. రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరారు.
పలాష్ ముశ్చల్ పెద్దగా పేరు లేని మ్యూజిక్ డైరక్టర్. చాలా కాలంగా స్మృతితో ప్రేమలో ఉన్నారు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత స్మృతి మంధాన పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే తమ లవ్ స్టోరీని బయటపెట్టి పెళ్లి విషయాన్ని కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పలాశ్ మశ్చల్ వ్యవహారశైలిపై అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఓ డాన్స్ మాస్టర్ తో ఎఫైర్, మరో మోడల్ తో అభ్యంతరకర చాటింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. ఈ కారణంగానే పెళ్లి రద్దు అయినట్లుగా తెలుస్తోంది.