చైతన్య : సోషల్ మీడియానే ఏపీ సర్కార్‌కు ప్రతిపక్షం..!

రాజకీయ పార్టీలు మాట మారిస్తే.. క్షణాల్లో నిజం బయటకు వచ్చేస్తోంది. పాలకులు హామీలు ఇవ్వలేదని నాలుక మడతేస్తే … ఆడియో, వీడియో హోరెత్తిపోతోంది. గతంలో రాజకీయం కోసం చేసిన తప్పులు… అధికారం కోసం పునరావృతం చేస్తే.. నషాళానికి అంటించేస్తోంది. అదే సోషల్ మీడియా. నిబంధనలు, నియంత్రణలను తట్టుకుని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏపీ సర్కార్‌కు ఇప్పుడు ప్రదాన ప్రతిపక్షంగా సోషల్ మీడియా మారిపోయింది.

శేఖర్ రెడ్డి విషయంలో ఏపీ సర్కార్ పరువు తీసిన సోషల్ మీడియా..!

శేఖర్ రెడ్డిని శేఖర్ ఏజేగా మార్చిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. ప్రధాన మీడియా దాన్ని చెప్పడానికి సంకోచించింది. అసలు శేఖర్ రెడ్డి.. శేఖర్ ఏజేగా ఎలా మారాడో.. పరిశోధించే ప్రయత్నంలో.. .నలిగిపోయింది. కానీ సోషల్ మీడియా అలా కాదు. మొత్తంగా బయట పెట్టేసింది. ఇదొక్కటే కాదు.. జగన్మోహన్ రెడ్డి ప్రతీ ప్రకటనను.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాటలను కలిపి… కుట్టేసి చూపిస్తోంది. నిజాలను ప్రజల ముందు ఉంచుతోంది. బోటు ప్రమాదం జరిగిన వెంటనే… సోషల్ మీడియాలో ప్రారంభమైన పోస్టుల విప్లవం ఓ రేంజ్ లో ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో బోటు ప్రమాదం జరిగినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలు …ముందుగా బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్పందననూ హైలెట్ చేశాయి. మృతుల కుటుంబాలకు .. తొలి రోజే పది లక్షల నష్టపరిహారాన్ని జగన్ ప్రకటించారు. కానీ ప్రతిపక్ష నేతగా పాతిక లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలోనూ అవే డిమాండ్లు చేశారు. అదే ఆయన గురించి సోషల్ మీడియా అందరికీ పరిచయం చేసింది.

నాలుక మడతలేసిన అన్ని నిర్ణయాలపైనా చెడుగుడే..!

సన్న బియ్యం విషయంలోనూ… ప్రభుత్వాన్ని నిలదీసింది సోషల్ మీడియా. ఏపీలో అధికారం లోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ భేటీలోనే.. ఇక రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి కొడాలి నాని విషయాన్ని మీడియా ముందు చాలా సార్లు చెప్పారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పంపిణీ అన్నారు. సన్నబియ్యం పేరుతో..సంచులకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆ ఫోటోలు కూడా రిలీజయ్యాయి. తర్వాత రాష్ట్రమంతటా కాదు.. శ్రీకాకుళం జిల్లాకే అన్నారు. మళ్లీ సన్నబియ్యం కాదు.. నాణ్యమైన బియ్యం అని మాట మార్చారు. తాము హామీ విషయంలో యూటర్న్ తీసుకుంటున్నామని … ఒప్పుకోకుండా.. అసలు తామెప్పుడూ.. సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదని నాలుక మడతేశారు. కానీ సోషల్ మీడియా… అప్పుడు.. ఇప్పుడు అని.. వైసీపీ ప్రభుత్వం అసలు రంగుని బయట పెట్టేసింది.

పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఎప్పుడు ఆదేశిస్తారు..!?

తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగులపరీక్ష పేపర్ లీకేజీ విషయంలోనూ.. మరోసారి సోషల్ మీడియా ఓ రేంజ్ లో అడుకుంటోంది. గతంలో.. నారాయణ కాలేజీలకు సంబంధించి ఇంటర్ పేపర్ లీకయిందని.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హడావుడి చేశారు. సీబీఐ విచారణ కావాలని రచ్చ చేశారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. అప్పట్లో పేపర్ లీకేజీకి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం… ఉద్యోగ పరీక్షల లీకేజీకి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. దీంతో.. సీబీఐకి ఇవ్వాలనే అప్పటి జగన్ డిమాండ్లను ఇప్పుడు సోషల్ మీడియా వినిపించడం ప్రారంభించింది. ఏపీ సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close