సైనా, సింధు…ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారు మరి

ప్రజలకు మంచి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల సొమ్మును దోచేస్తూ, వ్యవస్థలను నాశనం చేస్తున్న రాజకీయ నాయకులను ప్రశ్నించే దమ్ము మనకెవ్వరికీ ఉండదు. విమర్శించడానికి ధైర్యం చాలదు. కానీ విమర్శించడం అంటే మాత్రం మనకు మహా సరదా. అందుకే సమయం కోసం చూస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు, జస్ట్ బాధపడతారన్న విషయం తెలిసినప్పుడు, ఆ నమ్మకం కలిగినప్పుడు మాత్రం మూర్ఖంగా రెచ్చిపోతాం. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి మూర్ఖుడి గురించే…….

2012 ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సైనా నెహ్వాల్ గుర్తుందిగా. విజేతగా నిలిచిన సైనాను రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, బోలెడు మంది సెలబ్రిటీస్….ఇంకా సోషల్ మీడియా జనాలందరూ కూడా పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. అయితే ఈ ఒలింపిక్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది సైనా. ఆ లోటును తీరుస్తూ సింధు పతకం గెలిచింది. అందరూ సింధును అభినందించే పనిలో ఉంటే కొందరు సైకోలు మాత్రం ఓటమి బాధలో ఉన్న సైనా సహనాన్ని పరిక్షించడానికి రెడీ అయ్యారు. అలాంటి ఓ సైకో పైత్యం ఇది.

అన్షుల్ః డియర్ సైనా…ఇక నీ బ్యాగ్ సర్దేసుకో..మేటి ఆటగాళ్ళను ఎలా ఓడించాలో తెలిసిన ప్లేయర్ మాకు దొరికింది.

సైనాః ష్యూర్…థ్యాంక్యూ…సింధూ చాలా బాగా ఆడుతోంది….భారత్ బాగా ఆడుతోంది

అన్షుల్ః సైనా….నిన్ను కించపరచాలనే ఉద్ధేశ్యం నాకు లేదు. నేను ఎప్పటికీ నీ అభిమానినే అంటూ క్షమాపణలకు తోడుగా కొంచెం ఆయింట్‌మెంట్ పూసే ప్రయత్నం చేశాడు. ‘నో ప్రాబ్లం ఫ్రెండ్…’ అంటూ సైనా బదులిచ్చింది. అదీ ఓ విజేతకు, మూర్ఖుడికి మధ్య జరిగిన సంభాషణ. నిజానికి ఇప్పుడు సింధును అభినందిస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తున్నారు. సింధును కాదు. విజేతను అభినందించడాన్ని మనం చాలా గొప్పగా ఫీలవుతాం. విజయం సాధించిన వాడిని గుర్తించడం కూడా మన దగ్గర చాలా గొప్ప విషయం. మాకు ఎలాంటి ఇగో లేదు…అందుకే విజయం సాధించిన వాళ్ళను అభినందిస్తున్నాం అని చెప్పుకోవాలన్న తాపత్రయమే ఎక్కువ. క్రీడలంటే ఇష్టం లేదు. విజేతలుగా నిలవాలన్న ప్రయత్నంలో ఉన్న క్రిడాకారులను ఎలా ఎంకరేజ్ చేయాలో తెలియదు. ఓడిపోయిన వాళ్ళను హింసించడం మాత్రం తెలుసు. విజయాలను అభినందించడానికి మాత్రం ముందుంటాం. ప్రభుత్వాల విషయం తర్వాత…ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తే అప్పుడు చైనాతో పోటీపడదామా? అమెరికాతో పోటీ పడదామా? అన్న విషయాల గురించి ఆలోచించొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com