పేదల కోసం దీన్ దయాలు, సంపన్నుల కోసం హమ్ సఫర్ రైళ్ళు

రైల్వే బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభుపై ముందే ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా హామీలు తీసుకోకపోవడం వలన ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. తెలంగాణాలో తెరాస నేతలు యధాప్రకారం కేంద్రం తమ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపించిందని తిట్టుకొంటూ ప్రజలను చల్లబరుస్తారు. ఆంధ్రాలో తెదేపా-బీజేపీ నేతలు యధాప్రకారం ఒకరినొకరు విమర్శించుకొంటూ ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తారు. కనుక ఈ బడ్జెట్ లో లేని వాటి గురించి చెప్పుకొని బాధపడటం వలన కంఠశోష తప్ప మరేమి ఉండదు కనుక బడ్జెట్ లో ఉన్న కొన్ని ఆసక్తికరమయిన అంశాల గురించి చెప్పుకొని ఊరట చెందడమే మంచిది.

ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆ రాష్ట్రం పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించారు రైల్వే మంత్రి. చెన్నైలో రైల్వే ఆటో హబ్ ని ఏర్పాటు చేస్తున్నారు.

చార్జీలు పెంచడానికి బడ్జెట్ వరకు ఆగనవసరం లేదు కనుక చాలా రోజుల క్రితమే వాటిని పెంచేశారు. మళ్ళీ మున్ముందు ఏదో రోజు పెంచుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది కనుక ఈసారి బడ్జెట్ లో ప్రయాణికులపై, అదనపు భారం మోపలేదు. అలాగే సరుకు రవాణా చార్జీలను కూడా పెంచలేదు.
ఇక ఈ బడ్జెట్ లో ‘హమ్ సఫర్’, ‘తేజస్’ అనే రెండు కొత్తరకం సూపర్ ఫస్ట్ రైళ్ళను ప్రవేశపెడుతున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. వాటిలో ‘హమ్ సఫర్’ రైలులో అన్నీ థర్డ్ ఏసీ బోగీలే ఉంటాయి. మూడు హమ్ సఫర్ రైళ్ళను ప్రవేశపెట్టారు.

తేజస్ రకం రైళ్ళు గంటకి 130కిమీ వేగంతో నడుస్తాయి. వీటిలో విమానాలలోగానే ‘రైల్వే హోస్టెస్’ లుంటారు. ఈ రకం రైళ్ళలో వైఫీ, వినోద సౌకర్యాలు, ప్రాంతీయ వంటకాలతో భోజనాలు ఉంటాయి. ఈ రెండు రైళ్ళ నిర్వహణ ఖర్చులను టికెట్స్ మరియు అదనపు మార్గాల ద్వారా రాబట్టుకొంటారు.

ఉదయ్ అనే సాధారణ డబుల్ డక్కర్ రైలును, ఉత్క్రుష్ట్ యాత్రి ఎక్స్ ప్రెస్ అనే ఏసీ డబుల్ డక్కర్ రైలును ఈ బడ్జెట్ లో ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలలో ఈ రైళ్ళను రాత్రిపూట నడిపిస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ రకం రైళ్ళను ఏ ఏ రూట్లలో ప్రవేశపెట్టబోతున్నారో బడ్జెట్ పూర్తి పాఠం చూసిన తరువాత తెలుస్తుంది.
సామాన్యుల కోసం అన్నీ జనరల్ బోగీలే ఉండే అంత్యోదయ, దీన్ దయాలు అనే రెండు రైళ్ళను ప్రకటించారు. ఈ రైళ్ళలో మంచినీటి సౌకర్యం, సెల్ ఫోన్ల చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. వీటిలో అంత్యోదయ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా నడుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close