స‌న్నాఫ్ ఇండియా ట్రైల‌ర్‌: వ‌న్ మాన్ షో..!

మంచు ఫ్యామిలీ నుంచి ఓ సినిమా వ‌చ్చి చాలా కాలం అయ్యింది. అందునా మోహ‌న్ బాబు నుంచి. ఆయ‌నెప్పుడో పూర్తి చేసిన `స‌న్నాఫ్ ఇండియా` సినిమా ఒక‌టుంది. అని వార్య కార‌ణాల వ‌ల్ల అది విడుద‌ల కావ‌డం లేదు. ఎట్ట‌కేల‌కు ఈనెల 18న విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం రెడీ అయ్యింది. చాలా కాలం త‌ర‌వాత‌ మోహ‌న్‌బాబు సోలో హీరోగా న‌టించిన సినిమా ఇది. శ్రీ‌కాంత్‌, ప్ర‌గ్యా జైస్వాల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ట్రైల‌ర్ ఈ రోజు విడుద‌లైంది.

ఇది వ‌రకే స‌న్నాఫ్ ఇండియా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. అది వ‌చ్చి చాలా రోజులైంది. అందుకే ఇప్పుడు ట్రైల‌ర్ నెం.2 తీసుకొచ్చారు. మోహ‌న్ బాబుని డైలాగ్ కింగ్ అంటారు. అందుకే ఈ ట్రైల‌ర్ డైలాగుల‌తో నింపేశారు. చాలా డైలాగులు.. దేశం గురించి ఇందులోని కుళ్లు కుతంత్రాల గురించే. ఈ దేశంలో ఉన్న అవినితినీ, అరాచ‌కాన్ని క‌డిగి పారేయాల‌నుకునే ఓ వ్య‌క్తి క‌థ ఇది. అన్ని చోట్లా.. మోహ‌న్‌బాబు నిల‌బ‌డే డైలాగులు చెప్పేశారు. ద‌ర్శ‌కుడు డైమండ్ ర‌త్న‌బాబు స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌. కాబ‌ట్టి.. ఆయ‌న పెన్నుకి పుల్ స్టాప్ లేకుండా పోయింది. భార‌తీయుడు టైపులో అవినీతిపై ఉద్య‌మించే క‌థానాయ‌కుడి పాత్ర‌లో మోహ‌న్ బాబు క‌నిపించ‌నున్నారు. ఇలాంటి క‌థ‌లు చాలా వ‌చ్చాయి. ఆ అవినీతిని ఎలా అంత‌మొందించాడు? క‌లుపు మొక్క‌ల్ని ఎలా ఏరేశాడు? అనే పాయింట్ ఎంత కొత్త‌గా చెబితే అంత బాగుంటుంది. మ‌రి ఆ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ నెర‌వేరిందో చూడాలి. ట్రైల‌ర్‌లో డైలాగులు యావ‌రేజ్ గా ఉంటే, టేకింగు, నిర్మాణ విలువ‌లూ.. బిలో యావ‌రేజ్ స్థాయిలో నిలిచిపోయాయి. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన చిత్ర‌మిది. ఆయ‌నేమైనా అద్భుతాలు చేశాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.