పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కురాలిగా సోనియా ఎన్నిక‌!

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌రువాత కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా కొన‌సాగేది లేద‌ని రాహుల్ గాంధీ భీష్మించుకుని కూర్చున్న సంగ‌తి తెలిసిందే. ఇదే అంశం ఇవాళ్ల ఢిల్లీలో జ‌రిగిన కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో కూడా ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని వ‌ద్దంటున్న రాహుల్ ని… పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉండాలంటూ స‌భ్యులు కొంత ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. అయితే, అధ్య‌క్ష ప‌ద‌వినే వ‌ద్ద‌నుకుంటున్నాన‌నీ, అలాంట‌ప్పుడు పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఎలా కొన‌సాగుతాన‌ని రాహుల్ అన్న‌ట్టుగా తెలుస్తోంది. రాహుల్ ని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు మ‌రోసారి కూడా విఫ‌ల‌మ‌య్యాయ‌ని చెప్పొచ్చు. దీంతో రాహుల్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఎన్నిక అవుతార‌నే క‌థ‌నాల‌కు చెక్ ప‌డింది. దీంతో సోనియా గాంధీ ఈ బాధ్య‌త తీసుకోవాల్సిన‌ ప‌రిస్థితి వ‌చ్చింది!

తాజా స‌మావేశంలో సోనియా పేరును మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌తిపాదించారు. అనంత‌రం స‌భ్యులంద‌రూ ఆమెని పార్ల‌మెంట‌రీ పార్టీ లీడ‌ర్ గా ఎన్నుకున్నారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయం అవుతున్న నాయ‌క‌త్వ స‌మ‌స్య‌పై పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. నిజానికి, గ‌తంలో పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడిగా క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఉన్నారు. గ‌డ‌చిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న అనూహ్యంగా ఓట‌మిపాల‌య్యారు. దీంతో, పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు వ‌ద్దంటున్న రాహుల్ కి ఈ అవ‌కాశం ఇస్తారేమో అనే చ‌ర్చ జ‌రిగింది. కాంగ్రెస్ నాయ‌కులు కూడా అదే కోరుకున్నా కూడా… చివ‌రికి సోనియా గాంధీకి ఈ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు.

పార్ల‌మెంట‌రీ పార్టీ బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి కాంగ్రెస్ లో ప్ర‌త్యామ్నాయ నేత‌లు కూడా ఎవ్వ‌రూ లేని ప‌రిస్థితి. పార్టీ త‌ర‌ఫున గెలిచిన దాదాపు 50 మందిలో చాలామంది జూనియ‌ర్లు ఉండ‌టం, గెలిచిన‌వారిలో సీనియ‌ర్ల సంఖ్య గ‌తంతో పోల్చితే త‌గ్గ‌డం కూడా పార్టీకి మ‌రో స‌మ‌స్య‌గానే క‌నిపిస్తోంది. గ‌తంలో మ‌ల్లికార్జున త‌రువాత డెప్యూటీ లీడ‌ర్ గా జ్యోతిరాదిత్య సింధియా ఉండేవారు. కానీ, ఆయ‌న కూడా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. దీంతో సోనియాకి ఉండాల్సిన ప‌రిస్థితి అనివార్య‌మైంది. ఇంకోటి… ఇదే స‌మావేశంలో రాహుల్ గాంధీని అధ్య‌క్షుడిగా కొన‌సాగాలంటూ పార్ల‌మెంట‌రీ పార్టీ మ‌రోసారి తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కూడా రాహుల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close