రచ్చ రచ్చ చేసుకుని మళ్లీ సోనియాకే కిరీటం పెట్టిన కాంగ్రెస్ పెద్దలు…!

ఆరు నెలలు సాధన చేసి.. మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుగా ఉంది కాంగ్రెస్ తీరు. ఓ కొత్త అధ్యక్షుడినో.. అధ్యక్షురాలినో ఎంపిక చేసుకుని బీజేపీపై పోరాటానికి రెడీ అవ్వాలనుకుంటే కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు.. అక్కడి వరకూ రానివ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో..ఏ నిర్ణయమూ తీసుకోలేక..చివరికి మరికొన్ని నెలల పాటు సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతున్న సమయంలో…కాంగ్రెస్‌కు చెందిన 21 మంది సీనియర్లు.. ఓ లేఖ రాశారు. అది పార్టీకి… గాంధీ కుటుంబానికి డ్యామేజ్ చేసేలా ఉంది. ఈ లేఖ రాహుల్ గాంధీని సూటిగా తగిలింది. అందుకే ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ప్రారంభం కాగానే దీని గురించి ప్రస్తావించారు. బీజేపీతో కుమ్మక్కయి..ఇలాంటి లేఖలు రాస్తున్నారని ఆయన సీనియర్లైప మండిపడ్డారు. దీంతో సీనియర్లు నొచ్చుకున్నారు. సీడబ్ల్యూసీ భేటీ నుంచి ఆఫ్ లైన్‌కి వెళ్లిపోయిన కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. గులాంనబీ ఆజాద్ కూడా..రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

సీనియర్ల అసంతృప్తి హైలెట్ కావడంతో.. కాసేపటికే.. కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. సీనియర్లతోరాహుల్ వ్యక్తిగతంగా మాట్లాడారు. దాంతో కపిల్ సిబల్, ఆజాద్‌లు మాట మార్చారు. రాహుల్ గాంధీ ..తాము బీజేపీతో కుమ్మక్కయ్యారని అనలేదని చెప్పడం ప్రారంభించారు. రాహుల్‌గాంధీ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని … ప్రచారం జరగుతున్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేయలేదని చెప్పారని సిబల్ ప్రకటించారు. సీడబ్ల్యూసీలో రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలేం చేయలేదని అధికార ప్రతినిధి సూర్జేవాలా స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాత్రమే ఆయన నిలదీశారని.. రాహుల్‌ వ్యాఖ్యలు… సీనియర్లను అవమానించేలా ఉన్నాయనడం సరికాదన్నారు. ఆజాద్ కూడా… తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అనలేదని ప్రకటించారు.

ఈ పరిణామాలతో … సోనియా గాంధీ వైదొలగడంపై పెద్దగా చర్చ జరగలేదు. లేఖపై జరిగిన రచ్చతో.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. మరికొంత కాలం పాటు.. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న వివాదాల మధ్య… కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని భావించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తన సమస్యలు తాను పరిష్కరించుకోవడానికి తంటాలు పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close