ఎస్పీని నమ్ముతారా..? ఆర్థిక నేరస్తుడినా..? ఈసీకీ ఎస్పీ వెంకటరత్నం సూటి లేఖ..!

” ఓ వ్యాన్‌లో రూ. 50 కోట్లను .. తనిఖీ సిబ్బంది పట్టుకుంటే…దాన్ని విడిపించి.. ఎస్కార్ట్ ఇచ్చి మరీ… పంపించారు. ఆయన టీడీపీ తొత్తు..” అని ఆర్థిక నేరాల్లో జైలుకు సైతం వెళ్లి వచ్చిన విజయసాయిరెడ్డి.. శ్రీకాకుళం ఎస్పీపై ఫిర్యాదు చేస్తే … గంటలు గడవక ముందే.. అసలు అందులో ఇసుమంతైనా నిజం ఉందో లేదో.. తెలుసుకోకుండానే.. ఎస్పీపై బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓ నేరస్తుడు ఫిర్యాదు చేస్తే.. ఓ ఎస్పీపై చర్య తీసుకోవడం అసాధారణం. కనీసం వివరణ తీసుకోకుండా… ఇలా చేయడం పోలీసుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడమే. అచ్చంగా ఈసీ అదే చేసింది. శ్రీకాకుళం ఎస్పీని బదిలీ చేసింది. దీంతో ఆ ఎస్పీ తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. 30 ఏళ్లుగా నిర్మించుకున్న తన వ్యక్తిత్వాన్ని నాశనం చేశారని…బాధపడుతున్నారు. ఈ మేరకు ఈసీకే నేరుగా ఓ లేఖ రాశారు.

30ఏళ్ల శ్రమతో ప్రస్తుతం తాను ఉన్న పొజిషన్‌కు వచ్చానని లేఖలో వెంకటరత్నం గుర్తు చేశారు. ఎస్సై ర్యాంకు నుంచి కష్టపడి ఐపీఎస్‌ అధికారిగా ఎదిగానని .. తన జీవితంలో ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. విచారణ లేకుండా 24గంటల్లోనే తనపై చర్య తీసుకోవడం బాధించిందని వెంకటరత్నం లేఖలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని .. తప్పుడు ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిపై కేసు కూడా నమోదు చేశానన్నారు. వైసీపీ రాసిన లేఖపై ఎంత తొందరగా.. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిందో తన లేఖపైనా అదేవేగంతో నిర్ణయం తీసుకోవాలని.. తాను తప్పు చేస్తే శిక్షించాలని.. లేకపోతే.. తప్పుడు ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈసీకి… వెంకటరత్నం పంపించారు. ” ఆ రోజు.. ఎన్నికల నిఘా బృందం టీడీపీకి చెందిన వాహనాన్ని పట్టుకుంది. టీడీపీకి చెందిన జెండాలు, పోస్టర్లు అందులో ఉన్నాయి. మీడియా కూడా.. ఈ దృశ్యాలను కవర్ చేసింది. ఆ సమయంలో.. తాను క్రై్మ్ మీటింగ్‌లో ఉన్నానని… ఎస్పీ గుర్తు చేశారు. ఆ రోజు మావోయిస్టుల సంబంధిత అంశాలపై సమావేశమయ్యామం ” అని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ చేసిన ఫిర్యాదుపై గంటల్లోనే నిర్ణయం తీసుకున్న ఈసీ … గౌరవనీయమైన ఎస్పీ విషయంలో అంత వేగంగా స్పందిస్తుందా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓ పోలీస్ అధికారి రెప్యూటేషన్‌కి.. ఈసీ గౌరవం ఇవ్వకుండా.. ఓ ఆర్థిక నేరస్తుడి ఆరోపణకే.., విలువ ఇస్తే.. అంత కన్నా… బాధ్యతా రాహిత్యం ఇంకోకటి ఉండదనే అభిప్రాయాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close