చికాకులు రాకుండా స్పీకరు ముందు జాగ్రత్త

తెలుగుదేశం పార్టీనుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి ముందు ముందు న్యాయపరమైనా, సాంకేతిక పరమైనా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా తెలంగాణ శాసన సభ స్పీకర్‌ మధుసూదనాచారీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీనుంచి తెరాసలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను కలిసి పది మంది సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే. తామందరిని రాజ్యాంగం పదో షెడ్యులులోని నాలుగవ పెరాగ్రాఫ్‌ను నిర్వచించే నిభందన కింద తెరాసలో విలీసమైనట్లుగా గుర్తించాలంటు ఆ పది మంది కలిసి ఆ లేఖలో స్పీకరుకు విన్నవించుకున్నారు. అదే సమయంలో మొత్తం పదోవ షెడ్యులును వివరించే అంశాలకు విరుద్దంగా వీరు పార్టీ మారిపోయారు గనుక ఈ పదిమందిని అనర్హులుగా ప్రకటించాలంటూ కొత్తగా తెలుగుదేశం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి స్పీకర్‌కు మరో లేఖ రాశారు. ఈ విధంగా పరస్పర విరుద్దమైన రెండు లేఖలు తన వద్ద ఉండటంతో వీటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి స్పీకరు మధుసూదనాచారి తగు జాగురూకత పాటిస్థున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరడానికి సంబందించి గతంలోనూ ఫిర్యాధులు వచ్చినప్పటికీ ఆయన వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోలేదనీ వారిని అనర్హులుగా ప్రకటించలేదనీ ప్రతి పక్షాలు గోల చేస్తున్న తరుణంలో పదిమంది కూడా పార్టీ మారిపోయిన తర్వాత ఫిరాయింపుల చట్టం వర్తించకుండా మూడింట రెండు వంతుల మంది మేజారిటీ సభ్యులు వచ్చిన తర్వాత సాంకేతికంగా ఎం చేస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ముందు ముందు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయో ఆయన తర్కించి తెలుసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న న్యాయనిపుణులు రాజ్యాంగ నిపుణులతో సంప్రదించి భవిష్యత్తులో మళ్లీ ఎవరూ స్పీరు నిర్ణయం మీద విమర్శలు గుప్పించకుండా ఉండేలా సభబైన నిర్ణయం తీసుకునేలా స్పీర్‌ మధుసూదనాచారి ఆలోచిస్తున్నారని సమాచారం.

ఒకవైపు ఇదే మాదిరిగా మూడింట రెండు వంతుల సభ్యులు శాసన మండలిలో తెరాసలో చేరినపుడు వారందరూ కలిసి లేఖ ఇవ్వగానే మండలి అధ్యక్షుడు వారిని ఇదే నిభందనల ప్రకారం తెరాసలో విలీనమైనట్లుగా గతంలో గుర్తించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా ఏలాంటి గోలచేయకుండా కామ్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇప్పుడు మాత్రం ఆ నిభందనలు చెల్లవంటూ ఎందుకు యాగీ చేస్నున్నారో అర్థం కావడంలేదు.ఈ నిభందనలో ఉన్న మతలబును పరిశీలించి న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్ణయం తీసుకోవాలనీ మదుసూదనాచారి నిరీక్షిస్తున్నట్లుగా సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close