విశ్లేష‌ణ‌: రీమిక్స్ పాటలు అవసరమా అధ్య‌క్ష్యా..!

రీమిక్స్ పాటల ట్రెండ్ ఇప్పటిది కాదు. అప్పుడెప్పుడో వచ్చిన వంశీ ”కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’సినిమాలోనే ఈ రీమిక్స్ పాటలకు శ్రీకారం చుట్టారు. తర్వాత చాలా పాటలు ఇలా రీమిక్స్ అయి వచ్చాయి. పాత సినిమాల్లోని చార్ట్ బస్టర్ పాటలను తీసుకొని ఆ పాట క్రేజ్ తమ సినిమాకి ప్ల‌స్ అయ్యేలా చేయడం రీమిక్స్ పాటల టార్గెట్.

అయితే గతంలో ఏమో కానీ.. ఈ మధ్య వస్తున్న రీమిక్స్ పాటల్లో అసలు విషయం వుండటం లేదు. తాజాగా మరో రీమిక్స్ పాట వచ్చింది. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి. వినాయక్‌ దర్శకత్వం. మెగాస్టార్ చిరంజీవి ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని ‘చమక్‌ చమకు ఛాం’ సాంగ్‌ను ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేశారు. ఈ పాట విన్న తర్వాత ఈ మాత్రానికి రీమిక్స్ చేయడం ఆవసరమా?? అనిపిస్తుంది. ఇళయరాజా పాటల్లో జీవం వుటుంది. ఆ పాటలో వినిపించే ప్రతి సౌండ్ ఒక ఫీల్ తో నడుస్తుంది. ఈ రీమిక్స్ లో పాటను డిస్టర్బ్ చేయలేదు కానీ అందులో వున్న ఒరిజినల్ ఫ్లేవర్ ను మాత్రం మిస్ చేశారనిపిస్తుంది.

ఈ పాటే కాదు.. గతకొన్నాళ్ళుగా వస్తున్న ఏరీమిక్స్ పాటల్లో కూడా కొత్తదనం ఏమీ చూపించడం లేదు. కొంచెం తేడా చేసినా ఒరిజినాలిటీ దెబ్బతింటుదన్న భయం. ఆ భయంతో అసలు ఎలాంటి మార్పుల జోలికి వెళ్ళడం లేదు. కనీసం తాము వాడుకుంటున్న సినిమాలో సన్నివేశానికి తగ్గట్టుగా కూడా లిరిక్స్ ను మార్చడం లేదు. కేవలం సింగర్లను మార్పించి, లైవ్ ఆర్కిస్త్రా తీసేసి కంప్యూటరైజ్డ్‌ మ్యూజిక్ ని యాడ్ చేసి రీమిక్స్ పాట అని వదులుతున్నారు. వానావానా (ర‌చ్చ‌), శుభలేఖ రాసుకున్న (నాయ‌క్‌) , గోలీమార్ (రేయ్‌) , అందం హిందోళం (సుప్రీమ్‌), గువ్వా గోరింకతో (సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌) , ఆరేవో సాంబా (ప‌టాస్‌) ఈ పాటలన్నీ కూడా ఇలా వచ్చినవే.

అసలు ఎలాంటి మార్పులు చేయనప్పుడు ఒరిజినల్ పాటకు అలవాటు పడిన ఆడియన్స్ కి అదే ఒరిజినల్ పాటని వినిపిస్తే బావుటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. సింగర్ ని మార్చేసినంత మాత్రాన రీమిక్స్ అనుకుంటే ఎలా ? అసలు ఎలాంటి మార్పులు చేయకుండా ఈ సింగర్ ని మార్చడం వల్ల బ్యాండ్ పార్టీలో పాడిన పాటలా ఉటుందే కానీ రీమిక్స్ పాటల వుండటం లేదు. ఎలాంటి మార్పులు చేయనపుడు ఒరిజినల్ పాటకే నేటి థియేటర్ సౌండ్ కి తగ్గ డిటీఎస్ సౌండ్ మాస్టరింగ్ చేసి వదిలితే బావుటుంది కదా.. ఈ మాత్రం దానికి కొత్త సింగర్లతో పాడించి ఒరిజినల్ పాట ఫీల్ చెడగొట్టడం ఎందుకు? ఈ విష‌యంలో ద‌ర్శ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు, పాత పాట‌పై మోజు ప‌డ్డ క‌థానాయ‌కులు కాస్త ఆలోచిస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close