రూ.5 కోట్ల కారు.. ఇక ప్ర‌భాస్‌దేనా??

జేమ్స్ బాండ్ సినిమాలు గుర్తున్నాయి క‌దా? అందులో బాండ్ వాడే పెన్ ద‌గ్గ‌ర్నుంచి కారు వ‌ర‌కూ అన్నీ ప్ర‌త్యేకంగా ఉంటాయి. వాటిని స్పెష‌ల్‌గా డిజైన్ చేయిస్తారు. అలానే.. సాహో కోసం ఓ కారుని సృష్టించారు. ఆ వివ‌రాల్లోకి వెళ్తే…

సాహోలో ప్రభాస్ ఓ ప్ర‌త్యేక‌మైన రేస్ కారు వాడాడు. ఈ కారుని ఆస్ట్రియాలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించారు. దాని ఖ‌రీదు సుమారు రూ.5 కోట్లు. 20 నిమిషాల పాటు సాగే ప‌తాక స‌న్నివేశాల‌లో ఈ కారు క‌నిపించ‌నుంది. షూటింగ్ అయిపోయాక‌.. ఈ కారుని భ‌ద్రంగా ఇండియాకి తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ద‌గ్గ‌రే ఈ కారు ఉంద‌ని తెలుస్తోంది. సాహో ప్ర‌మోష‌న్ల‌లో ఈ కారుని వాడుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ప్రీ రిలీజ్ వేడ‌క‌లో స్టేజీపై కారుని తీసుకొచ్చి, అభిమానుల‌కు చూపించాల‌ని ప్లాన్ చేస్తోంది. ఆ కార్య‌క్ర‌మం కూడా అయిపోయాక‌.. ఈ కారుని ప్ర‌భాస్ వాడుకోబోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో వాడిన కొన్ని బైక్స్‌ని కూడా ఇలానే ప‌బ్లిసిటీలో భాగంగా చేసుకోవాల‌ని, సాహోకి మ‌రికాస్త క్రేజ్ తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. ఓ ప్రీ రిలీజ్ వేడుక‌లో హీరో వాడిన కారుని ప్ర‌మోష‌న్ కోసం తీసుకురావ‌డం ఇదే తొలిసారేమో…??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com