‘ఎన్టీఆర్’ స్పెష‌ల్‌… క‌ళ్ల‌జోడు, కుర్చీ

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ కోసం నంద‌మూరి బాల‌కృష్ణ కొన్ని ప్ర‌త్యేక‌మైన వ‌స్తువులు వాడారు. అందులో క‌ళ్ల‌జోడు, కుర్చీ ప్ర‌ధాన‌మైన‌వి. వాటికో విశిష్ట‌త ఉంది. అవి.. ఎన్టీఆర్ వాడిన వ‌స్తువులు. వాటిని ఈ సినిమాలో బాల‌య్య వాడారు. షూటింగ్‌లో వాడిన వ‌స్తువుల్ని కాస్ట్యూమ్స్‌నీ, ఆఖ‌రికి కార్ల‌నీ… కూడా దాచుకోవ‌డం అల‌వాటు. అలా దాచుకున్న వ‌స్తువుల్లో కొన్ని బ‌యోపిక్‌లో చూపించాల‌ని బాల‌య్య భావించారు. పౌరాణిక చిత్రాల్లో వాడిన కాస్ట్యూమ్స్.. అంటే గ‌ద‌, కిరీటం లాంటి వ‌స్తువుల్ని ఈ సినిమాలో వాడుకోవాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ అవి మ‌రీ శిధిలావ‌స్థ‌కు చేరుకున్నాయి. అందుకే ఆ మోడ‌ల్స్‌ని దృష్టిలో ఉంచుకుని… మ‌ళ్లీ కొత్త ఆభ‌ర‌ణాల్ని త‌యారు చేయించారు. అయితే క‌ళ్ల‌జోడు, కుర్చీ మాత్రం వాడుకోవ‌డానికి వీలుగా ఉండ‌డంతో… ఈ సినిమాలో వాటిని చూపిస్తున్నారు.

”నాన్న‌గారు దాచుకున్న వ‌స్తువుల్లో చాలామ‌ట్టుకు శిధిలావ‌స్థ‌కు చేరుకున్నాయి. ఇంకొన్ని ఎక్క‌డ ఉన్నాయో కూడా తెలీదు. మాకు అందుబాటులో ఉన్న‌వి క‌ళ్ల‌జోడు, కుర్చీ మాత్ర‌మే” అని నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ‘క‌థానాయ‌కుడు’ ఈ నెల 9న రాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 6న ‘మ‌హానాయ‌కుడు’ విడుద‌ల‌కు సిద్ధమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close