రాజ‌మౌళి కావాలంటే త్రివిక్ర‌మ్‌ని వ‌దులుకోవాలి

ఎస్.ఎస్‌.రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా ఏంటి? అందులో హీరో ఎవ‌రు?? ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లివి. ప్ర‌స్తుతానికైతే రాజ‌మౌళికి స్టార్ హీరోల‌తో ప‌నిలేదు. ఎవ‌రినైనా స‌రే, స్టార్ ని చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఆయ‌న‌కుఉంద‌న్న సంగ‌తి `ఈగ‌`తోనే అర్థ‌మైంది. అందుకే రాజ‌మౌళి ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేసే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ న‌మ్ముతూ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ఆ ఉద్దేశ్యాల్లోంచి జ‌క్క‌న్న బ‌య‌ట‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఈసారికి స్టార్ హీరోతోనే ప్రొసీడ్ అవ్వాల‌ని ఫిక్స‌య్యాడ‌ట రాజ‌మౌళి. ఆ స్టార్ హీరో ఎవ‌రు?? ఆ అవ‌కాశం ఎవ‌రికి ఉంది? అంటే.. ఎన్టీఆర్ అనే ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమ‌దొంగ‌… ఇలా హ్యాట్రిక్ విజ‌యాల్ని సొంతం చేసుకొన్న కాంబినేష‌న్ ఇది. దానికి తోడు… ఎన్టీఆర్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. జ‌క్క‌న్న‌తో మ‌ళ్లీ పనిచేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నాడు ఎన్టీఆర్‌.

‘నాతో సినిమా చేస్తావా, లేదా?’ అంటూ ఈమ‌ధ్య జ‌రిగిన ఓ పార్టీలో జ‌క్క‌న్న‌ని కాస్త సీరియెస్ గానే అడిగాడ‌ట తార‌క్‌. దాంతో.. జ‌క్క‌న్న కూడా మెత్త‌బ‌డ‌క తప్ప‌లేద‌ని తెలుస్తోంది. డివివి దాన‌య్య బ్యాన‌ర్‌లో రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అందులో హీరో ఎన్టీఆర్ అయ్యే అవ‌కాశాలే పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. ఆగ‌స్టులో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. అయితే.. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వ్వాల్సివుంది. రాజ‌మౌళి కోసం.. ఎన్టీఆర్ చేయాల్సిన మొద‌టి త్యాగం.. త్రివిక్రమ్ సినిమాని వ‌దులుకోవ‌డం. అందుకు ఎన్టీఆర్ కూడా సిద్దంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. సో.. ఎన్టీఆర్ – రాజ‌మౌళి కాంబో సెట్ట‌యితే.. త్రివిక్ర‌మ్ మ‌రో హీరోని చూసుకోవాలన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com