శ్రీ రెడ్డి బ‌యోపిక్ ఎంత వ‌ర‌కు వ‌చ్చిందంటే..?

శ్రీరెడ్డి ఇప్పుడు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో లైంగిక దోపిడీ ఎలా జ‌రుగుతుందో బాహాటంగా చెప్పిన తెలుగ‌మ్మాయి. ఇప్పుడు శ్రీ రెడ్డి మీద ఓ సినిమా తెర‌కెక్కుతోంది. `రెడ్డి డైరీస్` అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీరెడ్డి త‌న పాత్ర‌లో తానే న‌టిస్తోంది. ఆమెతో పాటు మ‌రికొంత‌మంది కొత్త వారిని ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నారు. శ్రీ రెడ్డి జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని చిత్తిరై సెల్వ‌న్ క‌థ‌ను, స్క్రీన్‌ప్లేను రూపొందించారు. డాక్ట‌ర్ అలాదీన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రంగీలా ఫిల్మ్ హౌస్ రూపొందిస్తోంది. ర‌విదేవ‌న్ నిర్మాత‌. చిత్తిరై సెల్వ‌న్ కూడా మ‌రో నిర్మాత‌. ఏప్రిల్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాల్లో అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పి శ్రీరెడ్డిని మోసం చేసిన వ్య‌క్తుల పేర్ల ప్ర‌స్తావ‌న కూడా ఈ చిత్రంలో ఉండ‌నుంద‌ట‌. ఎక్కువ భాగాన్ని అళెప్పీ, గోవాలో చిత్రీక‌రించారు. శ్రీరెడ్డి త‌న సొంత అనుభ‌వాల‌తో పాటు, త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చెప్పుకొన్న పలువురి అనుభ‌వాల‌ను కూడా ఈ క‌థ‌లో చొప్పించార‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close