శ్రీదేవి అడిగింది..శృతి హాసన్ వదులుకుంది..!

కోలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ అంతా పులి సినిమా నిర్మాతల మీద శ్రీదేవి చేసిన ఆరోపణలే.. సౌత్లో సూపర్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలను సంపాధించి బోని కపూర్ మ్యారేజ్ తర్వాత సౌత్ సినిమాలకు దూరమైన శ్రీదేవిని విజయ్ పులి సినిమా కోసం బాగా కష్టపడి, భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి తీసుకున్నారు. సినిమా రిలీజే నానా హంగామాల నడుమ అయ్యి అది కాస్త అభిమానులను నిరాశ పరిచింది. దాదాపు 100 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

అయితే ఇది చాలదు అన్నట్టు తనకు ఇంకా పులి నిర్మాతలు 50 లక్షలు ఇవాలని కొద్దిరోజుల క్రితం శ్రీదేవి ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అనుకున్న రెమ్యునరేషన్ తో పాటుగా ఆమెతో పాటు స్పెషల్ గా ఆమె కోసం వచ్చిన కేర్ టేకర్స్ కి అయిన ఖర్చంతా కలిపి ఇంకా శ్రీదేవి ఎదురు బాకీ ఉందని తేల్చి చెప్పారు పులి నిర్మాతలు. అయితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్న శ్రీదేవి ఆ విషయంలో వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు పులి నిర్మాతలకు తన వంతు సాయం చేస్తుంది శృతి హాసన్. రెమ్యునరేషన్ తాలుఖు తనకు లాస్ట్ గా ఇచ్చిన చెక్ 25 లక్షల రూపాయలది తను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైందట.

సినిమా నష్టాల్లో తాను కూడా పాలుపంచుకుంటున్నానని గర్వంగా చెప్పింది శృతి హాసన్. అయితే సినిమా నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసినా శ్రీదేవి రావాల్సిన పారితోషికం డిమాండ్ చేయడం చూసి అంతా విస్మయానికి గురయ్యారు. కాని శృతి హాసన్ మాత్రం నిర్మాత కష్టాన్ని చూసి తనకు రావాల్సిన 25 లక్షలను స్వతహగా వదులుకుని తన మంచి తనాన్ని చాటుకుంది. తండ్రి కమల్ హాసన్ దర్శక నిర్మాత కాబట్టి ఒక నిర్మాత కష్టాన్ని అర్ధం చేసుకోగల మంచి మనసు శృతి హాసన్ కి వచ్చిందని అందరు మెచ్చుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close