ఫస్ట్… లాస్ట్… శ్రీదేవి మెమరీస్

భూమ్మీద శ్రీదేవి యాభై నాలుగేళ్ళు బతికితే అందులో యాభై ఏళ్ళ జీవితాన్ని నటనకు అంకితం చేసింది. నాలుగేళ్ళ వయసు నుంచి నటించడం మొదలుపెట్టిన శ్రీదేవి మొత్తం ఐదు భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి మొత్తం మూడు వందల సినిమాలు చేస్తే… అందులో కథానాయికగా చేసినవి రెండు వందల యాభైకు పైగా వుండడం విశేషం. ప్రతి వ్యక్తికి జీవితంలో తొలి అడుగు, చివరి అడుగు చిరస్థాయిగా నిలుస్తాయి. శ్రీదేవి తుది శ్వాస విడిచిన తరుణంలో ఆమె ప్రతి భాషలో చేసిన తొలి, చివరి సినిమాల వివరాలు….

తమిళంలో…

బాలనటిగా తొలి సినిమా: ‘తునైవన్‌’ (1969)
కథానాయికగా తొలి సినిమా: ‘మూండ్రు ముడిచ్చు’
1976లో విడుదలైన ఈ సినిమాలో రజనీకాంత్-కమల్ హాసన్ హీరోలు.
చివరి సినిమా: ‘పులి’
2015లో విడుదలైంది. విజయ్ హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ హన్సికకు తల్లిగా, మహారాణిగా శ్రీదేవి నటించారు.

హిందీలో…

బాలనటిగా తొలి సినిమా: ‘రాణీ మేరానామ్‌’ (1972)
కథానాయికగా తొలి సినిమా: ‘సోల్వా సావన్‌’
1979లో విడుదలైన ఈ సినిమా ‘వసంత కోకిల’కు రీమేక్. ఇందులో అమోల్ పాలేకర్ హీరో
హిందీలో ఆఖరి సినిమా: ‘మామ్‌’
2017లో విడుదలైందీ లేడీ ఓరియెంటెడ్ సినిమా. ‘మామ్’ కాకుండా షారుఖ్ ఖాన్ ‘జీరో’లో అతిథి పాత్ర చేశారు. ఈ ఏడాది ‘జీరో’ విడుదల కానుంది.

కన్నడంలో…

తొలి సినిమా: ‘భక్త కుంబారా’ (1974)
చివరి సినిమా: ‘ప్రియ’ (1979)

తెలుగులో…

బాలనటిగా తొలి సినిమా: ‘మానాన్న నిర్దోషి’ (1970)
కథానాయికగా తొలి సినిమా: ‘అనురాగాలు’ (1976)
చివరి సినిమా: ‘ఎస్‌.పి.పరశురామ్‌’
1994లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి హీరో. ఆ తర్వాత తెలుగులో శ్రీదేవి సినిమా చేయలేదు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు సరిపెట్టుకున్నారు.

మలయాళంలో…

తొలి సినిమా: ‘కుమార సంభవం’ (1969)
చివరి సినిమా: ‘దేవరాగం’ (1996)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close