సీఎల్పీ నేతగా శ్రీధర్ బాబు..! రాహుల్ కొత్త ఆలోచన..!!

దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేరిస్తే… కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రెండు వరుస ఓటములు ఇచ్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అందుకే రాహుల్ గాంధీ.. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోపు అయినా కాస్తంత పుంజుకుని పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే వ్యూహాలను.. తన టీంతో సిద్ధం చేయిస్తున్నారు. ముందుగా… సీఎల్పీ లీడర్‌ను..ఉత్తర తెలంగాణ నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌నేత.. ప్రభుత్వ విప్‌.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్‌శానససభాపక్ష నేతగా ఎంపిక చేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజాలంతా పరాజయం పాలయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్లు మాత్రమే విజయం సాధించారు. వీరిలో శ్రీధర్ బాబు అయితే బెటరన్న ఆలోచన చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పోస్ట్ దక్షిణ తెలంగాణకు ఉన్నందున.. ఇత్తర తెలంగాణకు సీఎల్పీ పదవి ఇస్తే బ్యాలెన్స్ అవుతుందంని అంచనా. మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావును నక్సల్స్‌ కాల్చి చంపడంతో ఆయన వారసుడిగా శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఉన్నతవిద్య, పౌర సరఫరాల శాఖలతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌పార్టీ ఉమ్మడి కరీంనగర్‌జిల్లా అధ్యక్షుడిగా ఏఐసీసీ మెంబర్‌గా, 2014లో మానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తరపున.. సీనియర్లను నిలబెట్టాలనుకుంటున్నారు. ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లుగా సాగే అవకాశాలు ఉండటంతో.. ఓట్లు స్వింగ్ అవుతాయన్న ఆలోచనలో ఉన్నారు. బలమైన అభ్యర్థులు.. సామాజిక సమీకరణాలు కలిసి వస్తే… అసెంబ్లీ ఎన్నికల డిజాస్టర్ నుంచి బయటపడవచ్చనేది… కాంగ్రెస్ ఆలోచన. రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించకపోవడం వల్లే పరాజయం పాలైంది. అందుకే.. ఈ సారి సీఎల్పీ నేతను ఇతర సామాజికవర్గాలకు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది శ్రీధర్ బాబుకు అయినా అయి ఉండాలి లేదా.. భట్టి విక్రమార్కకు అయినా చాన్స్ కల్పించాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేస్తే.. రాహుల్ .. సీఎల్పీ నేత పదవిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close