ట్రెండు మార్చిన శ్రీ‌కాంత్‌

నేను ట్రెండ్ ని ఫాలో అవ్వ‌ను.. అంటే కుద‌ర‌దు. స్టార్ల‌యినా స‌రే, ట్రెండ్ ని ప‌ట్టించుకోవాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే. లేదంటే వెనుక‌బ‌డిపోవ‌డం ఖాయం. చేసిన సినిమాలే చేస్తే… ప్రేక్ష‌కుల‌కే కాదు, ఆయా హీరోల‌కూ విసుగొస్తుంది. ఈ విష‌యాన్ని కాస్త ఆలస్యంగా గ‌మ‌నించాడు శ్రీ‌కాంత్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌కు నప్పే రొటీన్ సినిమాలే చేసుకొచ్చిన శ్రీ‌కాంత్‌… ఇప్పుడు ట్రెండ్ మార్చాడు. ప్ర‌స్తుతం హార‌ర్ కామెడీ జోన‌ర్ బాగా న‌డుస్తోంది. చిన్న సినిమాలు పెద్ద విజ‌యాలు సాధిస్తున్నాయి. అందుకే…. తాను ఓ హార‌ర్ సినిమా చేసేశాడు. అదీ గ‌ప్ చుప్‌గా. ఈ చిత్రానికి డాన్స్ మాస్ట‌ర్ అమ్మ రాజశేఖ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ సినిమాకి ఇప్పుడు టైటిల్ కూడా ఫిక్స‌య్యింది. అదే… ఘోస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎన‌ర్జీ! టైటిల్‌ని బ‌ట్టి చూస్తే ఇదో దెయ్యం క‌థ అని అర్థ‌మైపోతుంది. శ్రీ‌కాంత్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. ఈమ‌ధ్య దెయ్యం క‌థ‌లు బాగా ఆడుతున్నాయ‌ని, అందుకే తానూ ఓ ప్ర‌య‌త్నం చేశాన‌ని చెబుతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా.. అతి త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్లు మొద‌లెట్ట‌బోతోంది. హిట్లు లేని అమ్మ‌రాజ‌శేఖ‌ర్‌నీ, శ్రీ‌కాంత్‌నీ ఈ దెయ్యం ఎంత వ‌ర‌కూ ఆదుకొంటుందో, ఎంత ఎన‌ర్జీ ఇస్తుందో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close