శ్రీ‌కాంత్‌… పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండానే…

హీరోల‌కు వార‌సులు ఉండ‌డం `అద‌న‌పు` బాధ్య‌తే అనుకోవాలి. అబ్బాయిలైతే హీరోలుగా ప‌రిచ‌యం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి బాధ్య‌త అవుతుంది. వాళ్లెలా ఉన్నా స‌రే… `హీరో`ని చేయాల్సిందే. అదృష్టం ఉంటే.. వార‌సుడిగా నిల‌బ‌డ‌తాడు. లేదంటే ప్ర‌య‌త్నం మాత్రం మిగులుతుంది. కానీ.. ఎంతో కొంత ఖ‌ర్చు చేయాలి. హీరోలు త‌మ పిల్ల‌ల్ని ఇంట్ర‌డ్యూస్ చేసే బాధ్య‌త వాళ్ల‌పైనే వేసుకుంటారు. నిర్మాత‌గా మ‌రో పేరు క‌నిపిస్తున్నా, వెనుక నుంచి నిధుల్ని అందించేది మాత్రం వాళ్లే.

అయితే శ్రీ‌కాంత్‌కి ఆ స‌మ‌స్య త‌ప్పింది. త‌న‌యుడు రోష‌న్ ఇది వ‌ర‌కే `నిర్మ‌లా కాన్వెంట్‌`తో హీరో అయిపోయాడు. ఆ సినిమా నిర్మాణ బాధ్య‌త‌ల‌న్నీ అన్న‌పూర్ణ స్డూడియోస్ చూసుకుంది. సినిమా ఫ్లాప్ అయ్యింది. నిర్మాత తాను కాక‌పోవ‌డం వ‌ల్ల శ్రీ‌కాంత్ సేఫ్ అయిపోయాడు. నిర్మ‌లా కాన్వెంట్ వ‌చ్చి రెండేళ్లు దాటేసింది. ఇప్పుడు రోష‌న్ మ‌రోసారి హీరోగా మారాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నాడు. ఈసారీ.. శ్రీ‌కాంత్‌కి ఖ‌ర్చు మిగిలింది.కార‌ణం.. రెండో సినిమా బాధ్య‌త‌ల్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మోస్తున్నారు. రోష‌న్ హీరోగా గౌరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. దీనికి నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ రెండూ రాఘవేంద్ర‌రావే. ఈ సినిమా ఆడితే, రోష‌న్‌కి మంచి భ‌విష్య‌త్తు ఏర్ప‌డ‌డం ఖాయం. నిజానికి రోష‌న్ రెండో సినిమాని తన నిర్మాణ సంస్థ‌లోనే తీద్దామ‌నుకున్నాడు శ్రీ‌కాంత్‌. కానీ రాఘ‌వేంద్ర‌రావు ముందుకు రావ‌డంతో ఈసారీ శ్రీ‌కాంత్‌కి ఖ‌ర్చు త‌ప్పిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close