శ్రీ‌నివాస‌రెడ్డి కొత్త సినిమా – బుజ్జిగాడి ఎంగేజ్‌మెంట్‌

గీతాంజ‌లితో హీరోగా మారాడు శ్రీ‌నివాస‌రెడ్డి. ఆసినిమా బాగానే ఆడింది. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా కూడా మంచి కాన్సెప్టే. అయితే… శుక్రవారం విడుద‌లైన `జంబ‌ల‌కిడి పంబ‌` మాత్రం తేడా కొట్టేసింది. క‌థ‌, క‌థ‌నాల్లో లోపం శ్రీ‌నివాస‌రెడ్డి క‌ష్టాన్ని, న‌మ్మ‌కాన్ని బూడిద‌లో పోసింది. అయితే శ్రీ‌నివాస‌రెడ్డికి హీరోగా ఛాన్సులు మాత్రం ఆగ‌డం లేదు. ఇప్పుడు మ‌రో ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు. లంక‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఓకే చెప్పాడు శ్రీ‌నివాస‌రెడ్డి. ఈ చిత్రానికి ‘బుజ్జిగాడి ఎంగేజ్‌మెంట్‌’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇది బావా మ‌ర‌ద‌ళ్ల క‌థ‌. వాళ్ల పెళ్లి చుట్టూ న‌డిచే స్టోరీ. ఈసారి మాత్రం వినోదం పుష్క‌లంగా ఉండేలా శ్రీ‌నివాస‌రెడ్డి జాగ్ర‌త్త పడుతున్నాడ‌ట‌. ఇండ్ర‌స్ట్రీలో ఉన్న టాప్ క‌మెడియ‌న్లంతా ఈ సినిమాలో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈసినిమాపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com