మహేష్ ని కలిసేందుకు శ్రీనువైట్ల.. కారణాలేంటో..?

బ్రూస్ లీ అపజయంతో అవమానాల పాలయిన దర్శకుడు శ్రీనువైట్ల మహేష్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్త. మొన్నటిదాకా ఇంట్లో గొడవలు, కోనాతో వాగ్వివాదం, సినిమా అపజయ భారం మోసిన శ్రీనువైట్ల ఇప్పుడు కాస్త వాటన్నిటి నుండి తేరుకున్నాడని తెలుస్తుంది. అయితే పెద్ద హీరోలెవరు సాహసించి తన దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం లేదు.. అయినా మహేష్ తో మాట్లాడేందుకు శ్రీనువైట్ల ప్రయత్నాలు చేస్తున్నాడట.

దూకుడు సినిమాతో విజయాన్నందించినా ఆగడుతో మహేష్ కి అపజయాన్నిచ్చిన శ్రీనువైట్ల సూపర్ స్టార్ ని కలవడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా అని అందరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పెద్ద హీరోలెవరు ధైర్యం చేసి శ్రీనువైట్లకి దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వరు కనుక పెద్ద హీరోకి తక్కువ, చిన్న హీరోలకు ఎక్కువైన కొందరు హీరోలు తనతో సినిమా చేసేందుకు తయారుగా ఉన్నారు. కాని శ్రీనువైట్ల మాత్రం మళ్లీ చేస్తే పెద్ద హీరోతోనే చేయాలని అనుకుంటున్నాడట.

అందుకే మహేష్ బాబుని కలిసే అవకాశం కోసం చూస్తున్నాడని అంటున్నారు. అయితే మహేష్ ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత మురుగదాస్ సినిమా కూడా వెంటనే ఉంది కాబట్టి మహేష్ ని బుట్టలో పడేసుకుందాం అనుకున్న శ్రీనువైట్ల ఆశలు అడి ఆశలే అవుతాయి. ఒకవేళ మహేష్ ని కలిసేది సినిమా కోసం కాకుండా వేరే ఇంకా ఏదన్నా విషయం ఉంటుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close