పుష్ప ఇండస్ట్రీ సినిమా : రాజమౌళి

”‘పుష్ప’ కేవలం బన్నీ సినిమా మాత్రమే కాదు. తెలుగు ఇండస్ట్రీ సినిమా.’ అన్నారు దర్శకుడు రాజమౌళి. అల్లు అర్జున్‌-సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రాజమౌళి వచ్చారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ”సుకుమార్ నా స్నేహితుడు, ఫేవరెట్‌ డైరెక్టర్‌. నాకు సుక్కు సినిమాలంటే ఇష్టం. పగలు రాత్రీ తేడా లేకుండా సుకుమార్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. సినిమా అద్భుతంగా వస్తుందన్న నమ్మకం ఉంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ పని మీద ముంబయికి వెళ్లినప్పుడు ఎవరిని అడిగినా ‘పుష్ప కోసం చూస్తున్నాం’ అంటున్నారు. బన్ని తప్పకుండా అక్కడ కూడా ప్రచారం చేయాలి. ‘పుష్ప’ కేవలం బన్నీ సినిమా మాత్రమే కాదు. తెలుగు ఇండస్ట్రీ సినిమా. దీని గురించి అందరికీ తెలియాలి. అల్లు అర్జున్‌ డెడికేషన్‌ కి హ్యాట్సాఫ్‌. బన్నీఇండస్ట్రీకి దొరికిన గిఫ్ట్‌. బన్నీ ని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు.” అని వ్యాఖ్యానించారు రాజమౌళి. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబరు 17న విడుదల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close